ప్రియాన్ష్ పై కోట్లాభిషేకం, ఐపీఎల్ లోకి సిక్సర్ల పిడుగు
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి అన్ క్యాప్డ్ క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. దేశవాళీ టీ ట్వంటీ లీగ్స్ లో మెరుపులు మెరిపిస్తున్న యంగ్ స్టర్స్ పై కోట్లు వెచ్చించాయి. ఈ క్రమంలో ఢిల్లీ యువ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య జాక్ పాట్ కొట్టాడు. అతడ్ని భారీ ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి అన్ క్యాప్డ్ క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. దేశవాళీ టీ ట్వంటీ లీగ్స్ లో మెరుపులు మెరిపిస్తున్న యంగ్ స్టర్స్ పై కోట్లు వెచ్చించాయి. ఈ క్రమంలో ఢిల్లీ యువ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య జాక్ పాట్ కొట్టాడు. అతడ్ని భారీ ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.ప్రియాన్ష్ ఆర్యను 3.80 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కైవసం చేసుకుంది. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆర్య కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. కాసేపు పంజాబ్, ఢిల్లీ మధ్య పోటీ నెలకొంది. అనంతరం ఢిల్లీ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రియాన్ష్ ను పంజాబ్ దక్కించుకుంది.
అయితే ప్రియాన్ష్ గురించి అంతగా ఎవరికీ తెలియదు. దేశవాళీ క్రికెట్‌లో పెద్దగా ఆడిన దాఖలాలు కూడా లేవు. అయినప్పటకీ ఓ కుర్ర క్రికెటర్ కోసం పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా ఎందుకింత ఖర్చు చేశారన్న చర్చ మొదలైంది. వెంటనే ప్రియాన్ష్ కోసం గూగుల్ సెర్చ్ మొదలుపెట్టారు. ఈ ఏడాది ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రియాన్ష్ ఆర్య అదరగొట్టాడు. ఓ మ్యాచ్‌లోనైతే ఒకే ఓవర్‌లో ఏకంగా 6 బంతులకు 6 సిక్సులు బాదాడు. ఈ ఇన్నింగ్స్ తోనే దేశంలోని క్రికెట్ అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు. క్లీన్ స్ట్రైకింగ్‌తో శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 50 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ కంటే ముందుకు కూడా ప్రియాన్ష్ మెరుగ్గా రాణించాడు
ఈ టోర్నీలో ఆర్య 198.69 స్ట్రైక్‌రేటుతో 608 పరుగులు చేశాడు. టీ20ల్లో కూడా మంచి రికార్డు ఈ యువ క్రికెటర్‌కు ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 356 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడిని ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ సొంతం చేసుకుంది.
ఇతర మ్యాచుల్లోనూ భారీ షాట్లతో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫియర్‌లెస్ అప్రోచ్, లెఫ్టాండ్ బ్యాటర్ కావడం, పరుగులు చేయాలనే తపన ఉండటం, భారీ షాట్లతో మ్యాచ్ ను మలుపుతిప్పే సత్తా ఉండటంతో ఈ దేశవాళీ ఆటగాడి కోసం ప్రీతి జింటా కోట్లు కుమ్మరించారని అభిప్రాయపడుతున్నారు.