ఆ టోర్నీల్లోనూ వారికి ప్రైజ్ మనీ బీసీసీఐ కీలక నిర్ణయం
వరల్డ్ క్రికెట్ లో రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ దేశవాళీ క్రికెట్ పై మరింత ఫోకస్ పెంచింది. గత కొన్నేళ్ళుగా రంజీ ట్రోఫీతో పాటు పలు దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లలో ఆటగాళ్ళ ఫీజులను పెంచిన బీసీసీఐ తాజాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ల అవార్డులకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయించింది.
వరల్డ్ క్రికెట్ లో రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ దేశవాళీ క్రికెట్ పై మరింత ఫోకస్ పెంచింది. గత కొన్నేళ్ళుగా రంజీ ట్రోఫీతో పాటు పలు దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లలో ఆటగాళ్ళ ఫీజులను పెంచిన బీసీసీఐ తాజాగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ల అవార్డులకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం పెద్ద టోర్నీలే కాకుండా మహిళల క్రికెట్ , జూనియర్ లెవెల్ టోర్నీల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ , ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లుగా ఎంపికయ్యే క్రికెటర్లకు నగదు ప్రోత్సాహకం లభించనుంది. బోర్డు తీసుకున్న నిర్ణయం యువక్రికెటర్లకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న యువ ఆటగాళ్ళ తరహాలోనే జూనియర్ స్థాయిలో యంగస్టర్స్ కు ఈ ప్రైజ్ మనీ ఖచ్చితంగా సంతోషాన్నిస్తుంది.