Producer Dil Raju : ఆ పదవి నుంచి దిల్ రాజు ఔట్…
సినిమాలు బాగా చూసేవాళ్లుకు ప్రొడ్యూసర్ దిల్ రాజును స్పెషల్‌గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడంటే ప్రొడ్యూసర్ ఎవరో ఎవరికీ తెలిసేది కాదు.
సినిమాలు బాగా చూసేవాళ్లుకు ప్రొడ్యూసర్ దిల్ రాజును స్పెషల్‌గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడంటే ప్రొడ్యూసర్ ఎవరో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం హీరోలతో దాదాపు సమానంగా ప్రొడ్యూసర్స్ కూడా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. వాళ్లే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగు వెలుగుతున్నారు. అలాంటి ప్రొడ్యూసర్స్‌లో ఒకరే దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నవ్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.
దిల్ రాజు కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కూడా. లాస్ట్ ఫిలిం ఛాంబర్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రొడ్యూసర్స్ విభాగం నుంచి దిల్ రాజు పోటీ చేసి గెలిచారు. కానీ ఇప్పుడు ఆ పదవి నుంచి దిల్ రాజు తప్పుకున్నారు. పదవీకాలం ముగియడమే ఇందుకు కారణం. ఫిలిం ఛాంబర్ బైలా ప్రకారం దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఫిలిం ఛాంబర్‌కు మరోసారి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో దిల్ రాజ్ స్థానంలో భరత్ భూషణ్ ఎన్నికయ్యారు.
ఈ సారి పిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత దిల్ రాజుకు అవకాశం ఇచ్చారు. దిల్ రాజు పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. ఏడాదికోసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఫిలిం ఛాంబర్‌లో మొత్తం సభ్యులు 48 మంది సభ్యులు కాగా ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులు 46 మంది. అందులో భరత్ భూషణ్‌కు 29 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్, వైవీఎస్ చౌదరి పోటీ పడుతున్నారు.