pushpa scene repeat : పుష్ప సీన్ రిపీట్.. 3 కోట్ల గంజాయి పట్టివేత..
ఆ కేటుగాళ్ళకు పుష్ప సినిమా బాగా నచ్చేసింది. అంతే.. యాజ్ ఇట్ ఈజ్ గా రియల్ లైఫ్ లో ఆ సీన్స్ ను దింపేశారు. గంజాయి స్మగ్లింగ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారో ఏమో.. ఇప్పుడు ఎన్నికల తనిఖీల్లో పట్టుబడ్డారు.

Pushpa scene repeat 3 crores of ganja
ఆ కేటుగాళ్ళకు పుష్ప సినిమా బాగా నచ్చేసింది. అంతే.. యాజ్ ఇట్ ఈజ్ గా రియల్ లైఫ్ లో ఆ సీన్స్ ను దింపేశారు. గంజాయి స్మగ్లింగ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారో ఏమో.. ఇప్పుడు ఎన్నికల తనిఖీల్లో పట్టుబడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో కూరగాయల ట్రాలీ ఆటోలో అక్రమంగా గంజాయ్ తరలిస్తున్న కేటుగాళ్ళ ముఠా పట్టుబడింది. అచ్చం పుష్ప సినిమాలో లోగా.. కూరగాలయ ట్రాలీ ఆటోలో అడుగున ఓ బాక్స్ ఏర్పాటు చేశారు.. అందులో గంజాయ్ పెట్టి సీక్రెట్ గా తరలిస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారో ఏమో.. ఎన్నికల అధికారులకు పట్టుబడ్డారు
ఎన్నికల తనిఖీలో భాగంగా వాహనాన్ని చెక్ చేయగా.. వెహికిల్ కింద ఏర్పాటు చేసిన బాక్సులో 635 కిలోల ఎండు గంజాయ్ పట్టుబడింది. దీని విలువ 3 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు హనుమాన్, మోహిత్, సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు.