Currency Notes: స్మార్ట్ ఫోన్ పౌచ్ లో కరెన్సీ నోటు పెడుతున్నారా.. అయితే ఈ విషయాన్ని గమనించండి
నేటి తరంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. పాకెట్ లో వాలెట్ లేకున్నా అరచేతిలో మొబైల్ మాత్రం ఉండాల్సిందే. అందులో కొందరు తమ పాకెట్ మనీని దాచుకునే వాలెట్ లాగా కూడా సెల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.
మన అఖండ భారతంలో ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలే ఉంటారు. వీరు రోజు వారి పాకెట్ ఖర్చుల కోసం 10,20,50,100 రూపాయలను క్యారీ చేస్తూ ఉంటారు. ఇందులో మిగిలిన వాటిని సెల్ ఫోన్ వెనుక భాగంలో పౌచ్ లో దాచిపెడుతూ ఉంటారు. మరి కొందరైతే ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడతాయని ఆలోచించి అందులో డబ్బులు పెట్టడం అలవాటుగా ఉంటుంది. అయితే కొన్ని పౌచ్ లు కనిపించేలా క్రిష్టల్ మోడల్స్ లో ఉంటాయి. మరి కొన్ని రకరకాల రంగుల్లో ఉంటాయి. లోపల డబ్బులు పెట్టినట్లు ఇతరులకు కూడా తెలియదు. ఇలా స్మార్ట్ ఫోన్లో భద్రపరచడం వల్ల సెల్ ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మన ఫోన్ ఎక్కువగా ఉపయోగించినప్పుడు వేడిగా మారుతూ ఉంటాయి. ఆ వేడిని బయటకు పంపించకుండా ఈ కరెన్సీ నోట్లు అడ్డుకుంటాయి. వేడిని ఆకర్షించే గుణం కరెన్సీకి ఎక్కువగా ఉంటుంది. డివైజ్ కు గాలి తగిలే అవకాశం ఉండదు. అలా బ్యాటరీ నుంచి ఉత్పత్తి అయిన వేడి తిరిగి బ్యాటరీకే రివర్స్ అవడం వల్ల పేలిపోయే అవకాశం ఉంది. అలాగే ఛార్జింగ్ చేసినప్పుడుకూడా వేడి వెలువడుతుంది. ఆ సమయంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.
కరెన్సీకి.. ఫోన్ పేలిపోవడానికి సంబంధం ఇదే..
మనం నిత్యం వినియోగించే కరెన్సీలు ప్రత్యేకమైన కాగితంతో తయారు చేస్తారు. పైగా దానిపై అనేక రంగుల రసాయనాల పూత ఉంటుంది. ఈ రసాయనాలు ఫోన్ నుంచి వచ్చే వేడిని ఆకర్షించి మరింత రసాయన చర్య జరిగేందుకు దోహదపడుతుంది. ఇలాంటి సమయంలో మన ఫోన్ కవర్ టైట్ గా ఉంటే ఈ రసాయన చర్య వల్ల వెలువడే టెంపరేచర్ బయటకు వెళ్లే ఆస్కారం లేక మంటలు చెలరేగచ్చు. లేదా పేలిపోవచ్చు. అవి పేలే సందర్భంలో చేతిలో, జేబులో ఉంటే ప్రాణ సష్టం లేదా తీవ్రమైన గాయాలు జరుగవచ్చు. అందుకే కరెన్సీని ఫోన్ లో భద్రపరుచుకోవడం ప్రమాదకరం అని ఎలక్ట్రానిక్ అండ్ కెమికల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
T.V.SRIKAR