అక్కడే ప్రేమలో పడ్డా, తన లవ్ స్టోరీపై పివి సింధు
ఎప్పుడూ మ్యాచ్ లతో బిజీగా ఉండే భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్ళి చేసుకుంది.
ఎప్పుడూ మ్యాచ్ లతో బిజీగా ఉండే భారత స్టార్ షట్లర్ పివి సింధు ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్ళి చేసుకుంది. హఠాత్తుగా తన ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయిన విషయాన్ని ప్రకటించిన సింధు ఫ్యామిలీ కొద్దిరోజుల్లోనే వివాహ తంతును కూడా పూర్తి చేసుకుంది. దీంతో సింధు లవ్ స్టోరీ గురించి అభిమానులు ఆసక్తిగా చర్చిస్తూనే ఉన్నారు. తాజాగా తన లవ్ స్టోరీ గురించి సింధునే స్వయంగా పలు విషయాలు పంచుకుంది. తాను ఎప్పుడు ప్రేమలో పడిందన్న విషయాన్ని కూడా చెప్పింది. వెంకట దత్త సాయితో తన లవ్ స్టోరీ గురించి సింధు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఓ విమాన ప్రయాణం తమని కలిపిందని చెప్పుకొచ్చింది. 2022 అక్టోబర్‌లో తామిద్దరం ఒకే విమానంలో ప్రయాణించామనీ, ఆ ప్రయాణంతో అంతా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఆ జర్నీ తామిద్దరినీ మరింత దగ్గర చేసిందనీ, అదంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లా అనిపించిందని సింధు తెలిపింది. అప్పటి నుంచే తమ లవ్ జర్నీ మొదలైనట్టు వెల్లడించింది.
నిశ్చితార్థం కూడా చాలా సింపుల్‌గా.. అత్యంత సన్నిహితుల మధ్య జరిగినట్లు సింధు వెల్లడించింది. తమ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని సింపుల్‌గా చేసుకోవాలనుకున్నామని,. ఆ క్షణం చాలా ఉద్వేగభరితమైనదిగా పేర్కొంది. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమంటూ ఎంగేజ్ మెంట్ క్షణాలను గుర్తు చేసుకుంది. ’ ఇక పెళ్లి ప్లానింగ్స్ పైనా పలు విషయాలు షేర్ చేసుకుంది. పెళ్లిని ప్లాన్ చేసుకోవడం అందమైన, సవాలుతో కూడుకున్నదన్న సింధు ప్రొఫెషనల్ అథ్లెట్‌గా బిజీ షెడ్యూల్ ఉనప్పటికీ అన్నింటినీ మేనేజ్ చేసుకున్నట్టు చెప్పింది. జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం కోసం అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నానీ, దత్తా కూడా తనవంతు సాయం చేశాడంటూ భర్తను ప్రశంసలతో ముంచెత్తింది.
కాగా ఉదయ్‌పూర్‌లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గత ఆదివారం మూడు ముళ్ల బంధంతో సాయి-సింధు ఒక్కటయ్యారు. ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది.తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా ఈ పెళ్లిని నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి మొత్తం 140 మంది ముఖ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. గత రాత్రి హైదరాబాద్ లో రిసెప్షన్ కూడా ఘనంగా నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు హాజరై సింధు దంపతులను ఆశీర్వదించారు.