PVR Inox : పీవీఆర్ ఐనాక్స్ బంపర్ ఆఫర్.. మంత్లీ ప్లాన్ తో బహుళ సినిమాలు చూడొచ్చు.. !

దేశవ్యాప్తంగా భారీ నెట్ వర్క్ ఉన్న ఈ పీవీఆర్ ఐనాక్స్ సంస్థ.. తొలి సారిగా ఇన్- థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలో సబ్‌స్క్రిప్షన్ ద్వారా చూసే అవకాశం వస్తే.. ఆ అభిమానికి అంతకు మించి మరె గొప్ప ఉండకపోవచ్చు బహుశా.. ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ సంస్థ మూవీ లవర్స్ కు ఈ విషయంలో గుడ్ న్యూస్ చెబుతూ మరి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2023 | 12:39 PMLast Updated on: Oct 15, 2023 | 12:39 PM

Pvr Inox Bumper Offer You Can Watch Multiple Movies With Monthly Plan Theater Monthly Plan In Ott Format

సినిమా.. ఈ రోజుల్లో సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం అంటే చాలా ఇబ్బందికి గురైతువున్నారు. మొదటి గా చెప్పాలంటే టికెట్ ఖర్చు మినిమం 400 ఉంటుంది. అక్కడ షాప్ లో ఉండే తినుబండారాలు ధరలు ఆకాశన్ని అంటుతాయి. ఇక మీ ఫ్యామిలీతో సినిమాకు వెళ్లారా.. అయితే మీ జేబుకు పెద్ద కన్నం పడినట్టే. దీని మూలంగానే కుటుంబ సమేతంగా సినిమాలు చూడటం మానివేశారు ప్రేక్షకులు. అధికాకుండా థియేటర్ కి వెళ్లి వచ్చే ప్రయాణ ఖర్చు ఎక్కువే.. వీటన్నిటికి ఒక ప్రయాత్నం దూరం చేసింది. అదే ఓటీటీ. ఈ వ్యవస్థ ఫీచర్ వచ్చాక సినీ ప్రేక్షకులు ఎవ్వరు కూడా థియేటర్ కు వెళ్లి సినిమాల చూడటం అనవసర అదే ఓటీటీ అయితే ఒకే సారి ఫ్యామిలి మొత్తం చూడవచ్చు. థియేటర్ కు రాకపోవడం కూడా కరోనా కూడా ఓ కారణమని చెప్పవచ్చు. కరోనాకు ముందు కరోనాకు తర్వాత థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఘనణియంగా పడిపోయింది. ఎన్ని ఆఫర్లు పెట్టి ప్రజలు థియేటర్ ల వంక కూడా చూడటం లేదు అంటే నమ్మండి. విటాన్నిటికి చెక్ పెట్టెలా పీవీఆర్ ఐనాక్స్ సంస్థ వినూత్నంగా ఓ ప్రయోగం చేయబోతుంది అదేంటో చూద్దాం రండి మరి..

దేశవ్యాప్తంగా భారీ నెట్ వర్క్ ఉన్న ఈ పీవీఆర్ ఐనాక్స్ సంస్థ.. తొలి సారిగా ఇన్- థియేటర్ మూవీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలో సబ్‌స్క్రిప్షన్ ద్వారా చూసే అవకాశం వస్తే.. ఆ అభిమానికి అంతకు మించి మరె గొప్ప ఉండకపోవచ్చు బహుశా.. ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ సంస్థ మూవీ లవర్స్ కు ఈ విషయంలో గుడ్ న్యూస్ చెబుతూ మరి. పీవీఆర్ ఐనాక్స్ సంస్థ శనివారం అక్టోబర్ 14న తమ మంత్లీ ప్లాన్‌ గురించి ఓ ప్రకటన చేసింది. “పీవీఆర్ ఐనాక్స్ పాస్ పోర్ట్” పేరుతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ విధానాన్ని తీసుకొచ్చింది పీవీఆర్ ఐనాక్స్. సిని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఈ ప్లాన్ ప్రకటించినట్లు సమాచారం.

ఓటీటీ తరహాలో నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్..

ఈ ప్లాన్ తీసుకున్న వారు నెలకు రూ. 699 చెల్లించి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వర్తిస్తుంది. ఓటీటీల్లో ఎలా అయితే సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటామో అలాగే ఇందులో తీసుకోని నెలలో 10 సినిమాలు చూసే విలు కల్పిస్తుంది పీవీఆర్ ఐనాక్స్. ఈ విధానం సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే వర్తిస్తుంది. అంటే వీకెండ్‌లో సినిమాలుచూసే అవకాశం లేదన్న మాట. ఈ ఆఫర్ అక్టోబర్ 16 నుంచి ఈ ప్రక్రియ అందుబాటులోకి రానుంది.

ఓటీటీలోకి రావాలంటే..?

పీవీఆర్ ఐనాక్స్ పాస్ పోర్ట్ మంత్లీ ప్లాన్ తదితర విషయాలపై సంస్థ కో సీఈఓ గౌతమ్ దత్తా మాట్లాడారు. “చాలా మందికి సినిమాలను థియేటర్లలో చూడటమే ఇష్టమని చెబుతున్నారు. కానీ వారు థియేటర్లకు మాత్రం రావడం లేదు. తాజాగ విడుదలైనా.. పఠాన్, జవాన్.. విడుదల కాబోతున్న..సలార్, లియో వంటి భారీ సినిమాలు ఓటీటీలోకి రావాలంటే కొన్ని వారాల సమయం, లేదా అంతకంటే ఎక్కువే పట్టోచ్చు. థియేటర్లలో సినిమాలను చూడాలని ఉన్నా.. ప్రేక్షకులు ఖర్చుకు వెనుకాడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది” అని గౌతమ్ దత్తా అన్నారు.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఈ ప్రయత్నం..

Theater monthly plan

కరోన ఎఫెక్ట్ తో థియేటర్లకు ప్రేక్షకులు చాలా అంటే చాలా దూరమయ్యారు. కరోన సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి మూవీ లవర్స్ బాగా అలవాడు పడ్డారు. దీంతో వారు థియేటర్ కి రవడమే మానేశారు. “ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం ఇండస్ట్రీకి మంచి కాదు. పైగా దీనివల్ల చిన్న సినిమాలకు చాలా నష్టం కలుగుతుంది. అందుకే ఆడియెన్సును తిరిగి థియేటర్లకు రప్పించేందుకు ఈ నెలవారీ ప్లాన్ తీసుకొచ్చాం. ఇక పీవీఆర్ ఐనాక్స్ సంస్థ మల్టీప్లెక్సుల్లో ఆహారం, కూల్ డ్రింక్స్ ధరలను ఇప్పటికే 40 శాతం మేర తగ్గించాం. ప్రేక్షకులు నెలలో రెండు మూడు సార్లు థియేటర్లకు రావడం మొదలైతే షోలు పెరిగి.. మరిన్ని చిన్న చిన్న సినిమాలు వస్తాయి. దీంతో మళ్లీ థియేటర్లకు రావడం అలవాటుగా మారుతుంది” అని గౌతమ్ దత్తా పేర్కొన్నారు.

సింగిల్ యూజర్‌కు మాత్రమే ఈ ప్లాన్ వర్తింపు..

ఈ నెలవారి ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ను మొదటిలో పీవీఆర్ ఐనాక్స్ యాప్, వెబ్ సైట్ నుంచి కనీసం మూడు నెలలకు తీసుకోవాల్సి ఉంటుంది. సినిమా టికెట్ బుకింగ్ సమయంలో పేమెంట్ ఆప్షన్‌లో పాస్‌పోర్ట్ కూపన్‌ను వినియోగించుకోవాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ టికెట్స్ బుక్ చేయాల్సి వస్తే.. ఫ్యామిలి గాని, స్నేహితులు గానీ వస్తే ఒక టికెట్‌కు మాత్రమే పాస్ వస్తుంది. మిగిలిన టికెట్స్ మొత్తాన్ని పే చేయాల్సి ఉంటుంది. ఇది సింగిల్ యూజర్‌కు మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా ఈ ప్లాన్ ను ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేయడం కుదరదు. థియేటర్‌లోకి వెళ్లినప్పుడు థియేటర్ యాజమన్యంకు మీ ఐడీ కార్డ్ చూపించాల్సి ఉంటుంది.

S.SURESH