Radhika Merchant: రాధికా ప్రీ వెడ్డింగ్‌ స్పీచ్‌.. ఆ మూవీ నుంచి కాపీ కొట్టిందా..?

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటిసారి.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మాట్లాడిన మాటలు.. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అనంత్ మాటలకు ముఖేష్‌ కన్నీళ్లు పెట్టుకుంటే.. రాధికా మర్చంట్ స్పీచ్‌కు అతిధిలంతా ఫిదా అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 8, 2024 | 02:45 PMLast Updated on: Mar 08, 2024 | 2:45 PM

Radhika Merchant Copy Her Soulful Pre Wedding Speech From The Film Dance With Me

Radhika Merchant: అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌.. ప్రీ వెడ్డింగ్ వేడుక గురించి దేశమంతా ఇంకా మాట్లాడుకుంటోంది. ఇండియాలో టాప్ స్టార్ అనే ప్రతీ ఒక్కరు.. ఆ మూడు రోజులు జామ్‌నగర్‌లోనే కనిపించారు. అమితాబ్‌ నుంచి ముగ్గురు ఖాన్‌ల వరకు.. బిల్‌గేట్స్‌ నుంచి జుకర్‌బర్గ్‌ వరకు.. సచిన్ నుంచి ధోని వరకు.. అంతా ఆ వేడుకలో సందడి చేశారు. ఆ వెడ్డింగ్‌ కలెక్షన్‌, ఆ ఏర్పాట్లు, ఆ అతిధి మర్యాదలు, ఆ ఆనందం.. అబ్బో తలుచుకుంటేనే అదుర్స్ అనిపిస్తుంది ఇప్పటికీ !

Sudha Murty‎: రాజ్యసభకు సుధామూర్తి.. రాష్ట్రపతి కోటాలో ఎంపిక

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మొదటిసారి.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ మాట్లాడిన మాటలు.. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అనంత్ మాటలకు ముఖేష్‌ కన్నీళ్లు పెట్టుకుంటే.. రాధికా మర్చంట్ స్పీచ్‌కు అతిధిలంతా ఫిదా అయ్యారు. ఐతే రాధిక స్పీచ్‌లో కొన్ని మాటలు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. భూమ్మీద వందల కోట్ల మంది ఉన్నారని.. ఐతే మనకు కావాల్సిన వాళ్లను, మనం సర్వస్వం అనుకునే వాళ్లను ఎన్నుకోవడంలోనే నిజమైన జీవితం ఉందని.. మంచి, చెడు, విషాదం.. అన్నింట్లో తోడు ఉండాలని.. నీ అందమైన జీవితంలో నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అనంత్‌ అంటూ రాధికా మాట్లాడిన మాటలు.. ప్రతీ ఒక్కరిని కదిలించాయ్. ఇవే మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయ్. డ్యాన్స్ విత్ మి అనే ఇంగ్లీష్‌ మూవీ నుంచి ఈ మాటలను రాధికా కాపీ చేసిందంటూ.. ఆ సినిమా క్లిప్పులను కొందరు వైరల్ చేస్తున్నారు. రాధిక స్పీచ్‌, ఆ మూవీ డైలాగ్స్‌ పక్కనపక్కన వేసి ప్లే చేస్తూ.. ఈ స్పీచ్‌ కాపీ అంటూ.. వైరల్ చేస్తున్నారు. నిజానికి ఆ మూవీ డైలాగ్స్‌, రాధికా మాటలు సేమ్ ఉన్నాయ్‌ కూడా !

ఐతే దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. డ్యాన్స్ విత్ మి అనే మూవీ 2004లో రిలీజ్ అయింది. ఆ సినిమా డైలాగులు చెప్పినంత మాత్రాన.. అదేదో తప్పు చేసినట్లు చూస్తే ఎలా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. చిన్నతనంలో చూసిన సినిమాల్లోని డైలాగులు నచ్చి.. ఇన్‌స్పైర్ అవడం ఖాయం.. వాటిని డెయిలీ లైఫ్‌లో ఎవరైనా ఉపయోగిస్తారు.. ఆ మాత్రం దానికి ఇంతలా వైరల్ చేయాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఐతే ఆ మాటల వెనక ఎమోషన్ చూడాలి కానీ.. ఆ మాటలను పట్టుకొని వేళ్లాడితే ఎలా మాస్ అంటూ.. ఈ స్పీచ్ వైరల్ చేస్తున్న వ్యక్తిని ఆడుకుంటున్నారు ఇంకొందరు. ఏమైనా.. రాధిక స్పీచ్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.