Radhika Merchant: అంబానీ కోడలంటే అట్లుంటది మరి.. బంగారంతో తయారు చేసిన లెహంగాతో రాధికా..!
అంబానీ ఫ్యామిలీకి తగ్గట్లుగానే కాబోయే కోడలు రాధికా మర్చంట్ కూడా రిచ్‌నెస్‌తో వార్తల్లోకెక్కారు. ఈ వేడుకల్లో భాగంగా ఆమె ధరించిన లెహంగా, ఆమె పట్టుకున్న హాండ్ బ్యాంగ్ , ఆమె పెట్టుకున్న జ్యుయలరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Radhika Merchant: భారతదేశంలో అత్యంత ధనవంతులైన అంబానీ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. తన స్నేహితురాలు రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ వివాహ వేడుకకు ముందు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలు వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సినిమాల్లోనూ, కథల్లోనూ కవులు వర్ణించినట్లు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలు ఇప్పటికీ టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలుస్తున్నాయి. ఈ వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ ధరించిన నగలు, డ్రెస్సులు అన్నీ హాట్‌టాపిక్‌గా మారాయి.
Prabhas: రాజాసాబ్.. ఆ రేంజ్‌లో ఉంటుందా.. అంచనాలు పెంచేస్తున్న నటుడి కామెంట్స్
ఇక.. అంబానీ ఫ్యామిలీకి తగ్గట్లుగానే కాబోయే కోడలు రాధికా మర్చంట్ కూడా రిచ్‌నెస్‌తో వార్తల్లోకెక్కారు. ఈ వేడుకల్లో భాగంగా ఆమె ధరించిన లెహంగా, ఆమె పట్టుకున్న హాండ్ బ్యాంగ్ , ఆమె పెట్టుకున్న జ్యుయలరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబానీ.. భారత దేశ అపరకుబేరుడు. మరి ఆ రేంజ్‌ని, ఆ వైభవాన్ని, ఆ దర్పాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు. అలాంటిది ఆ ఇంటికి కాబోయే కోడలు మాత్రం అందుకు తక్కువ ఉంటుందా..? ఆ రేంజ్‌కు తగ్గట్లుగానే ఉంటుంది. అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ తమ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సరిగ్గా అదే రేంజ్‌ను మెంటైన్ చేసింది. తన అత్తింటి రేంజ్‌కు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్ ధరించి అంబానీలకు తగ్గ కోడలు అని ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా ఈ వేడుకల్లో చివరి రోజున రాధికా మర్చంట్ ధరించిన లెహంగా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ లెహంగాను ఏకంగా బంగారపు దారాలతో తయారు చేశారట. ఇక.. ఆ లెహంగా మీద ధరించిన దుప్పటాను ఏకంగా ఆరు నెలల పాటు ఎంతో అందంగా ప్రత్యేకంగా రూపొందించారట. దీన్ని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఎంతో స్పెషల్ కేర్ తీసుకొని డిజైన్ చేశారట.
ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కేవలం ఇదొక్కటే కాదు.. ఈ వేడుకల్లో భాగంగా కాస్ట్లీ బ్లాక్ కలర్ చీరలో ధగధగా మెరిసిపోయిన రాధికా మర్చంట్.. చేత్తో పట్టుకున్న మినీ హ్యాండ్ బ్యాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆ బ్యాగ్ ధర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో మిక్ ఫ్రంట్ ఫ్లాప్ సిగ్నేచర్ కెల్లీ డిజైన్‌తో పాటు.. చైన్ మెయిల్ బాడీ షోల్డర్ చైన్ వంటి మెరుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మినీ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా రూ.52 లక్షల 30 వేలట..!! అంటే అరకోటి పైమాటే. ఈ బ్యాగ్ చేతబట్టుకొని కాబోయే భార్యాభర్తలు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంట ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో మరి అంబానీ కాబోయే కోడలా.. మజాకా..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి అంబానీ ఇంటి కాబోయే కోడలంటే మాటలా..? అట్లుంటది అంబానీతోని అంటున్నారు.