Radhika Sarathkumar: బీజేపీ ఎంపీగా నటి రాధిక.. పోటీ అక్కడి నుంచే..
విరుదునగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేరుగా పోటీ చేస్తుందా లేక పొత్తుకు కేటాయిస్తుందా అనే డైలమా కనిపించింది ఓ స్టేజిలో ! ఐతే ఎట్టకేలకు రాధిక పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్‌గా శరత్ కుమార్‌కు చెందిన ఆలిండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

Radhika Sarathkumar: తమిళనాడులో ఎలాగైనా సత్తాచాటాలని ఫిక్స్ అయిన బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. నాలుగో జాబితా రిలీజ్ చేసిన కమలం పార్టీ.. తమిళనాడు, పురుచ్చేరి నుంచి 15మంది అభ్యర్థులను అనౌన్స్ చేసింది. తెలుగు, తమిళ సినిమాల్లో యాక్ట్ చేసి అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాధికా.. బీజేపీ తరఫున పార్లమెంట్ బరిలో నిలవబోతున్నారు. విరుదునగర్ పార్లమెంట్ స్థానం నుంచి రాధిక.. ఎంపీగా పోటీచేయబోతోంది.
Devara: టైగర్ వేట.. గోవాలో ‘దేవర’.. మాస్ జాతరే..
నిజానికి విరుదునగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేరుగా పోటీ చేస్తుందా లేక పొత్తుకు కేటాయిస్తుందా అనే డైలమా కనిపించింది ఓ స్టేజిలో ! ఐతే ఎట్టకేలకు రాధిక పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్‌గా శరత్ కుమార్‌కు చెందిన ఆలిండియా ఈక్వాలిటీ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆయన భార్య, నటి రాధికకు ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చింది. 2007లో శరత్‌కుమార్ ఈ పార్టీని ప్రారంభించారు. మొదట్లో డీఎంకే కూటమిలో భాగంగా ఉన్నారు. తర్వాత అన్నాడీఎంకేలో చేరారు. దాన్ని కూడా విడిచి.. ఈ మధ్య పార్టీని బీజేపీలో విలీనం చేశారు. వందల సినిమాల్లో నటించిన రాధిక బుల్లితెర సీరియల్స్‌లోనూ యాక్ట్ చేస్తోంది. ఆమె రాడాన్ మీడియా వ్యవస్థాపకురాలు కూడా! దీని ద్వారా సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తున్నారు. ఆమె 2001లో నటుడు శరత్‌కుమార్‌ను వివాహం చేసుకుంది.
2006 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. అక్టోబర్ 18, 2006న, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆమెను అన్నాడీఎంకే నుండి బహిష్కరించారు. 2021 నుంచి తన భర్త మొదలు పెట్టిన పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. దక్షిణాదిన సత్తాచాటాలని భావిస్తున్న బీజేపీ.. సినీ, స్పోర్ట్స్ గ్లామర్‌ను ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా.. రాధికకు టికెట్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.