Radisson Drugs Case: ఓరి.. వీళ్ల వేషాలో.. డ్రగ్ టెస్ట్‌లో దొరక్కుండా ఇన్ని నాటకాలా..
12మందిలో మొత్తం ముగ్గురికి మాత్రమే పాజిటివ్ రాగా.. మిగతా వారికి నెగిటివ్ వచ్చింది. యూరిన్ శాంపిల్స్‌లో ఆరుగురికి నెగిటివ్‌గా నిర్ధారించారు. పార్టీ జరిగిన వారం తర్వాత విచారణకు రావడంతోనే.. నెగిటివ్ వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు వ్యవహారం.. టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. పార్టీ జరిగిన తర్వాత రోజే టెస్ట్ చేయడంతో ఈ ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డ్రగ్ టెస్ట్ తప్పించుకునేందుకు నిందితులు ఆడుతున్న నాటకాలు అన్నీ ఇన్నీ కావు. 12మందిలో మొత్తం ముగ్గురికి మాత్రమే పాజిటివ్ రాగా.. మిగతా వారికి నెగిటివ్ వచ్చింది. యూరిన్ శాంపిల్స్‌లో ఆరుగురికి నెగిటివ్‌గా నిర్ధారించారు. పార్టీ జరిగిన వారం తర్వాత విచారణకు రావడంతోనే.. నెగిటివ్ వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
MS DHONI: ధోనీ సంచలన నిర్ణయం..? చెన్నై కొత్త కెప్టెన్‌గా యువ ఓపెనర్
పూర్తి డైట్ పాటించడంతో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ వచ్చిన వాళ్లు డ్రగ్స్ తీసుకోలేదా.. లేదంటే దొరక్కుండా జాగ్రత్త పడ్డారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. మొత్తం 12మందిలో నటుడు నీల్ మినహా.. అందరూ విచారణకు హాజరయ్యారు. ఐతే పోలీసుల డ్రగ్ టెస్ట్‌లో దొరకకుండా వాళ్లు వేస్తున్న వేషాలు అన్నీ ఇన్నీ కావుల. హెయిర్ శాంపిల్స్‌లో బయట పడకుండా హెయిర్ డై .. గోళ్లకు పెడిక్యూర్ చేసుకుని నిందితులు విచారణకు వస్తున్నట్లు తెలుస్తోంది. రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ కేసులో 12మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్లలో కొంత మంది విచారణకు వెంటనే రాకుండా పలు కారణాలు చూపించి ఆలస్యం చేశారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు విచారణకు వస్తున్నారు. అయితే ఈలోపు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుని.. అధికారుల ముందు హాజరవుతున్నట్టు తెలుస్తోంది.
వారం తర్వాత బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ఇవ్వడంతో నెగిటివ్ వస్తున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మరి అధికారులు అనుమానిస్తున్నట్టు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే వాళ్ల రిపోర్ట్‌లు నెగిటివ్ వచ్చాయా.. లేదంటే సదరు నిందితులు డ్రగ్స్ తీసుకోలేదా.. అనేది తేలాల్సి ఉంది. హెయిర్, యూరిన్ శాంపిల్స్‌లో నెగిటివ్ రావడంతో.. ఇప్పుడు అధికారులు బ్లడ్ శాంపిల్స్ మీదే ఆధారపడ్డారు. త్వరలో ఈ రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది.