Raghu Rama Krishna Raju: రఘురామకు లైన్‌ క్లియర్‌..? అనపర్తి, నరసాపురం టీడీపీకే

అనపర్తి టికెట్‌ టీడీపీకి ఇస్తే దానికి బదులుగా తంబల్లపల్లి లేదా ఏలూరు లేదా రాజంపేట టికెట్‌ కావాలని బీజేపి డిమాండ్‌ చేస్తోంది. దీనికి టీడీపీ నుంచి కూడా సుముఖత వ్యక్తమైనట్టు సమాచారం. దీంతో అనపర్తి విషయంలో దాదాపు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2024 | 02:05 PMLast Updated on: Apr 13, 2024 | 2:05 PM

Raghu Rama Krishna Raju Will Contest From Narasapuram From Tdp

Raghu Rama Krishna Raju: అనపర్తి, నరసాపురం స్థానాల్లో టీడీపీకి దాదాపు లైన్‌ క్లియర్‌ ఐనట్టు తెలుస్తోంది. కూటమిలో సీట్ల మార్పుపై చంద్రబాబు ఇంట్లో కీలక సమావేశం జరిగింది. అభ్యర్థుల మార్పు గురించి జనసేన బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చించారు. అనపర్తి, నరసాపురం టికెట్ల విషయంలో కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనపర్తి టికెట్‌ టీడీపీకి ఇస్తే దానికి బదులుగా తంబల్లపల్లి లేదా ఏలూరు లేదా రాజంపేట టికెట్‌ కావాలని బీజేపి డిమాండ్‌ చేస్తోంది. దీనికి టీడీపీ నుంచి కూడా సుముఖత వ్యక్తమైనట్టు సమాచారం. దీంతో అనపర్తి విషయంలో దాదాపు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

Israel, Iran War : ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు.. యుద్ధానికి సంకేతమా..?

ఇక ఉండి విషయంలో కూడా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ఉండి నుంచి రఘురామను పోటీకి దింపబోతున్నారు అన్న వార్తలతో అంతర్గత కుమ్ములాట మొదలయ్యింది. ఇక్కడి నుంచి టికెట్‌ ఆశించిన రామరాజు, శివరామరాజు ఇద్దరూ రఘురామకు సహకరిస్తారా అన్న అనుమానాలు టీడీపీలో బలంగా ఉన్నాయి. దీంతో రిస్క్‌ తీసుకునే పొజిషన్‌లో లేని టీడీపీ.. రఘురామకు వేరే ప్రాంతంలో టికెట్‌ అకామిడేట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీకి ఇచ్చిన నరసాపురం టికెట్‌ను అడుగుతోంది టీడీపీ. ఏలూరు టికెట్‌ బీజేపీకి ఇచ్చిన నరసాపురం టికెట్‌ టీడీపీ తీసుకుంటే అక్కడి నుంచి రఘురామను ఎంపీగా బరిలో దింపాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక రఘురామకు లైన్‌ క్లియర్‌ ఐనట్టే. దీనికి తోడు రఘురామకు టికెట్‌ రాకుండా జగన్‌ ఆపాడని, కూటమి మీద కూడా జగన్‌ ప్రభావం ఉంది అనే మరకను కూడా కూటమి చెరుపుకొనే వీలుంటుంది. దీంతో నరసాపురం కోసం టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

నరసాపురానికి బదులుగా ఏలూరు స్థానం బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉంది. ఏలూరు నుంచి ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్‌ను ప్రకటించింది టీడీపీ. కానీ ఇక్కడ నుంచి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి టికెట్‌ ఆశించారు. టీడీపీ నిర్ణయంతో అసంతృప్తికి గురైన గారపాటి ఇండిపెండెంట్‌గా పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఏలూరు టికెట్‌ బీజేపీకి ఇస్తే ఆ వ్యతిరేకతను కూడా తగ్గించుకోడానికి వీలవుతుంది. దీంతో అనపర్తి, నరసాపురం స్థానాలను టీడీపీ దాదాపుగా తీసుకున్నట్టే అంటున్నారు. మరి దీనిపై అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.