Raghu Rama Krishna Raju: రేపే టీడీపీలోకి రఘురామ.. అసెంబ్లీ టిక్కెట్ కన్ఫామ్..
కూటమి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి వెళ్ళగా.. అక్కడ RRRకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించింది. ఆ టిక్కెట్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల దగ్గర పైరవీ చేశారు.

Raghu Rama Krishna Raju: బీజేపీలో టిక్కెట్ రానీయకుండా జగన్ విజయం సాధించారు. ఈ ఒక్క ప్రకటన ఎంపీ రఘురామ కృష్ణ రాజుకి టీడీపీలో టిక్కెట్ కన్ఫమ్ అయ్యేలా చేసింది. బీజేపీని నమ్ముకొని ఆయన నిండా మునిగిపోయారు. నాలుగున్నరేళ్ళుగా వైసీపీ రెబల్‌గా కొనసాగుతూ.. కమలం పార్టీకి బాగా దగ్గరయ్యారు. కానీ నరసాపురం టిక్కెట్టు రఘురామ కృష్ణం రాజుకు ఇవ్వలేదు బీజేపీ పెద్దలు. కమలం పార్టీలో ఉన్న వైసీపీ అనుకూల నేతలు తనకు టిక్కెట్ రాకుండా చేశారనీ.. జగన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడని ఆరోపించారు.
GOLD PRICES: పసిడి పరుగు.. మిడిల్ క్లాస్‌కు బంగారం ఇక కలేనా..?
కూటమి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి వెళ్ళగా.. అక్కడ RRRకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించింది. ఆ టిక్కెట్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల దగ్గర పైరవీ చేశారు. నరసాపురం టిక్కెట్టు తమకు ఇస్తే.. ఏలూరు బీజేపీకి ఇస్తానని ప్రపోజల్ పెట్టారు. కానీ ఎంత ఒత్తిడి తెచ్చినా శ్రీనివాసవర్మను మార్చేది లేదని తెగేసి చెప్పింది కమలం పార్టీ. దాంతో చేసేది లేక అసెంబ్లీకి అయినా పోటీ చేయాలని రఘురామ డిసైడ్ అయ్యారు. అందుకే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. శుక్రవారం పాలకొల్లు పర్యటనకు వస్తున్న చంద్రబాబు సమక్షంలో రఘురామ కృష్ణ రాజు టీడీపీలో చేరుతున్నారు. రఘురామ కృష్ణం రాజు పోటీ చేయకపోతే జగన్ విజయం సాధించినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాదు.. ఆయన్ని నరసాపురం లోక్ సభ పరిధిలోని ఉండి నియోజకవర్గం నుంచి దించుతున్నారు.
అక్కడ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థికి.. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రఘురామ కృష్ణంరాజు ఆర్థికంగా భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి రఘురామను ఉండి నుంచి అసెంబ్లీ బరిలోకి దించుతున్నారు చంద్రబాబు. మరి ఆయన ఈ ఎన్నికల్లో ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి. అలాగే వైసీపీ ఓడించే వాళ్ళ జాబితాలో ఇప్పుడు రఘురామను కూడా చేర్చే ఛాన్సుంది.