Rahul Gandhi: డబ్బులు దోచుకోవడానికే కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం: రాహుల్ గాంధీ

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం కట్టడానికి ముఖ్య ఉద్దేశం నీళ్ల కోసం కాదు.. డబ్బులు దోచుకోవడానికి. ధరణి ద్వారా భూములని లాక్కోవడానికి కేసీఆర్ చూస్తున్నాడు. దళిత బంధులో కమిషన్‌ల పేరిట దోచుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2023 | 06:28 PMLast Updated on: Nov 26, 2023 | 6:28 PM

Rahul Gandhi Comments On Brs And Pm Modi In Kamareddy

Rahul Gandhi: కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదని, డబ్బులు దోచుకోవడానికే అని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆదివారం, కామారెడ్డిలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, బీజేపీలపై విమర్శలు చేశారు. “కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం కట్టడానికి ముఖ్య ఉద్దేశం నీళ్ల కోసం కాదు.. డబ్బులు దోచుకోవడానికి. ధరణి ద్వారా భూములని లాక్కోవడానికి కేసీఆర్ చూస్తున్నాడు. దళిత బంధులో కమిషన్‌ల పేరిట దోచుకుంటున్నారు.

Revanth Reddy’s open letter : స్థానిక ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

పేపర్ లీక్‌తో నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ అడుగుతున్నాడు. కేసీఆర్ తిరుగుతున్న రోడ్లు, మీరు చదువుకున్న విద్యాసంస్థలు కాంగ్రెస్ కట్టినవే. నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతాడో కేసీఆర్ అదే చెపుతాడు. బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే. కేసీఆర్, మోడీ ఒకటే కాకుంటే కేసీఆర్‌పై ఈడి, సిబిఐ కేసులు పెట్టేది. మోదీ తెచ్చే చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారు. బీసీ సీఎం అంటున్నారు.. ముందు రెండు శాతం ఓట్లు తెచ్చుకోండి. మోదీ తెచ్చే చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారు.

బీజేపీ పని తెలంగాణలో అయిపోయింది. అందుకే బీజేపీ, బిఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుంది. పేదల నుంచి దోచుకున్న డబ్బులను తిరిగి ఇస్తాం. అందుకే ఆరు గ్యారేంటిలు తీసుకొచ్చాం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం” అని రాహుల్ వ్యాఖ్యానించారు.