Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్మికులతో సీఎం సమావేశం: రాహుల్‌గాంధీ
పనిగంటలు పాటించకుండా ... రోజుకి 11 గంటల పాటు వర్క్ చేస్తున్నా తమ జీవితాలకు భద్రత లేకుండా పోయిందని అంటున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ తమ గోడు చెప్పుకున్నారు.
Rahul with Giga workers: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పారిశుద్ధ్య కార్మికులు. డెలివరీ బాయ్‌లు, డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని AICC నేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్‌లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లతో రాహుల్ ముఖాముఖి జరిగింది. తాము కొన్నేళ్ళుగా పడుతున్న ఇబ్బందులను రాహుల్ దృష్టికి తెచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాగే కార్మికులతో సీఎం సమావేశమం ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రమాదాల్లో తమ వారు చాలామంది చనిపోతున్నారనీ… కొందరు తీవ్రగాయాలతో మంచాలకే పరిమితం అవుతున్నారు. కానీ తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ… తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పారిశుద్ధ కార్మికులు, డెలివరీ బాయ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద బీమా కల్పించాలని డెలివరీ బాయ్‌లు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.
పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారని తమ సమస్యలను ఆటో, క్యాబ్ డ్రైవర్లు రాహుల్ దృష్టికి తెచ్చారు. జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారనీ…. రోజుకి 8 గంటలకు కాకుండా 11 గంటలు పనిచేయించుకుంటున్నారని పారిశుద్ధ్య కార్మికులు ఆరోపించారు. కనీస సదుపాయాలు కల్పించడం లేదనీ… వాటిని అడిగితే ఉద్యోగం మానేయమని చెబుతున్నారని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని కార్మికులు రాహుల్‌గాంధీకి చెప్పారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయించాలని కోరారు జీహెచ్ఎంసీ వర్కర్లు.