RAHUL GANDHI: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ.. యువతకు రాహుల్ హామీ..
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువత ఉద్యోగ కల్పన కోసం అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తాం.
RAHUL GANDHI: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ. భారత్‌జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాజస్థాన్ బన్‌స్వారాలోని నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా యువతకు కాంగ్రెస్ ఏం చేయబోతుందో చెప్పారు. ”కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
Narendra Modi: వివాహాలకోసం విదేశాలకు కాదు.. జమ్ము కాశ్మీర్ రండి: మోదీ
డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువత ఉద్యోగ కల్పన కోసం అప్రెంటీస్‌షిప్‌లు కల్పిస్తాం. శిక్షణ ఇప్పించి వారిలో నైపుణ్యాన్ని కల్పిస్తాం. ఒక సంవత్సర అప్రెంటీస్‌షిప్ సమయంలో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. దీనిపై ప్రత్యేక చట్టాన్ని తెస్తాం. దీని ద్వారా 25 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి శిక్షణ కల్పించి ప్రభుత్వ లేదా ప్రైవేటురంగంలో ఉపాధి లభించేలా చూస్తాం. ఉద్యోగ నియామకాల కోసం జరిగే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్‌లను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాం. స్టార్టప్‌లకు రూ.5 వేల కోట్ల నిధులు ఇస్తాం. దీనివల్ల దేశంలో లక్షలాది మందికి ఉపాధితో పాటు సంపద సృష్టి జరుగుతుంది.
దేశ జనాభాలో 90 శాతం మంది దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలే ఉన్నారు. కానీ వివిధ సంస్థల్ని… దేశ బడ్జెట్‌ను పరిశీలించండి. ఈ వర్గాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం పెద్దగా కనిపించదు. రామ మందిర ప్రారంభోత్సవంలో మన ఆదివాసి రాష్ట్రపతి కనిపించలేదు. ఈ వేడుకలకు రావొద్దని నేరుగా ఆమెకే సందేశం పంపించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని మా మేనిఫెస్టోలో చేర్చాం. అంటే ఎమ్ఎస్పీ కోసం చట్టం తీసుకురావాలని నిర్ణయించాం” అని రాహుల్ వ్యాఖ్యానించారు.