Telangana Elections : ఈనెల 25న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన..
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు సార్లు ఎన్నికల్లో పాల్గొన్న టీపీసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనేందుకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనే 25న రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతుంది.

Rahul Gandhi's visit to Telangana on 25th of this month..
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రచారంలో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే పలు సార్లు ఎన్నికల్లో పాల్గొన్న టీపీసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి తెలంగాణ ఎన్నికల్లో పాల్గొనేందుకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనే 25న రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండబోతుంది. ఈ పర్యటనలో ఒక రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచార సభల్లో పాల్గొని ప్రసింగించనున్నారు.రాహుల్ ముందుగా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు బోధన్ నియోజకవర్గంకు చేరుకోనున్నారు రాహుల్ గాంధీ. బోధన్ ప్రచారం అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కు వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు. తర్వాత ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు చేరుకొని అప్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రికి హెలికాప్టర్ లో బేగం పేటకు చేరుకోని ఢిల్లీ బయలుదేరుతారు.