ఎక్కడైనా బ్యాటింగ్ చేస్తా, ప్లేస్ ఇవ్వమంటున్న రాహుల్
గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీపడుతున్నారు. అందుకే తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారుతోంది. పిచ్ పరిస్థితి , ప్రత్యర్థిని అంచనా వేసుకుని ఫైనల్ ఎలెవన్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆసీస్ టూర్ లో రెండో టెస్టుకు భారత తుది జట్టు ఎంపిక ఛాలెంజ్ గా మారింది.
గత కొంతకాలంగా భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీపడుతున్నారు. అందుకే తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారుతోంది. పిచ్ పరిస్థితి , ప్రత్యర్థిని అంచనా వేసుకుని ఫైనల్ ఎలెవన్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆసీస్ టూర్ లో రెండో టెస్టుకు భారత తుది జట్టు ఎంపిక ఛాలెంజ్ గా మారింది. ఈ నేపథ్యంలో కొందరు ఆటగాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు కెప్టెన్ తిరిగి రావడంతో ఎక్కడ ఆడతాడన్నది సస్పెన్స్ గా మారింది. మూడో స్థానంలోకి శుభ్‌మన్ గిల్ కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో మరోసారి రాహుల్ మిడిలార్డర్ కు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాను ఏ స్థానంలో అయినా ఆడతాను కానీ.. తుది జట్టులో మాత్రం తీసుకోమంటూ రాహుల్ వ్యాఖ్యానించాడు.
వెళ్లి జట్టు కోసం ఆడాలని భావిస్తున్నట్టు చెప్పాడు. పరిస్థితులను బట్టి ఎలా పరుగులు చేయాలన్నది తాను చూసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. తన గేమ్ ను సాధ్యమైనంత వరకు సింపుల్ గా ఉంచాలనుకుంటున్నట్టు చెప్పాడు. గతంలో వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు లేదని రాహుల్ చెప్పాడు. మొదటి 25, 30 బంతులు జాగ్రత్తగా ఆడటం ఎంత ముఖ్యమో తనకు తెలుసన్నాడు. రెండో టెస్టులో తాను ఏ స్థానంలో ఆడబోతున్నానో టీమ్ తనకు క్లారిటీ ఇచ్చిందని, అయితే దానిని బయటకు చెప్పలేనని రాహుల్ వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో ఓపెనింగ్ చేయబోతున్నట్లు తనకు చాలా రోజుల ముందే చెప్పారని, దానికి సంసిద్ధం కావడానికి తనకు తగినంత సమయం దొరికిందని రాహుల్ వెల్లడించాడు.
పెర్త్ టెస్టులో బౌన్సీ పిచ్ పై రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన 77 రన్స్ చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టీమిండియాకు 200కుపైగా తొలి వికెట్ భాగస్వామ్యం అందించిన ఘనతను యశస్వితో కలిసి అందుకున్నాడు. కేఎల్ రాహుల్ తన కెరీర్లో తొలిసారి ఓ డేనైట్ టెస్టు ఆడబోతున్నాడు. పింక్ బాల్ తో ప్రాక్టీస్ బాగ సాగిందని, తాను ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్లు తెలిపాడు. డే నైట్ టెస్టు ఆడడంలో తనకు అనుభవం లేదన్నాడు.