Rain Alert For AP: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో హైఅలర్ట్..
జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.
Rain Alert For AP: ఏపీలో రెండురోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయ్. ఐతే రాబోయే మూడు రోజులు జనాలు అప్రమత్తంగా ఉండాలని.. భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే చాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి ఆవరించి ఉంది.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. జనాలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లోని ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయ్.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం పార్వతీపురం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయ్. దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్నిచోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. విజయనగరం జిల్లా గరివిడిలో 13 సెంటీమీటర్లు, అల్లూరి జిల్లాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.
మిగిలిన కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక అటు విశాఖ, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీలోనూలో భారీ వర్షాలు పడుతున్నాయ్. మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయ్. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని.. చెట్లు, టవర్స్, పోల్స్ కింద ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు.