Andhra Pradesh Rain : ఏపీకి మళ్లీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో వర్షం పడే అవకాశం..
మొన్నటి వరకు ఏపీకి మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. తాజాగా మరో సారి ఏపీకి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
మొన్నటి వరకు ఏపీకి మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. తాజాగా మరో సారి ఏపీకి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీందో సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో శుక్ర,శని వారం దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తెలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వర్షాల సంగతి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లో ఏజెన్సీ ప్రాంతం..
ఇక మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చలి పులి వణికిస్తోంది. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తోంది. తుఫాన్ తర్వాత నుంచి ఈ చలి వాతావరణం మరింతగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభఆవం కూడా ఉంటోంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.