Telangana Rain : తెలంగాణకు వర్ష చూచన.. 4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

తెలంగాణకు వర్ష సూచన.. తెలంగాణకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం 27వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2023 | 11:07 AMLast Updated on: Nov 26, 2023 | 12:38 PM

Rain Forecast For Telangana Moderate To Heavy Rains In Four Days

తెలంగాణకు వర్ష సూచన.. తెలంగాణకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగైదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం 27వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

Telangana Elections : టెన్షన్‌ పెడుతున్న లాంగ్‌ వీకెండ్‌.. టెకీలు ఓటేస్తారా..

దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో రుతుపవనాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఈరోజు హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి ఆకాశం మబ్బులుగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో.. ఈ జిల్లాల్లో ముఖ్యంగా.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈరోజు బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, అల్లూరి, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

తెలంగాణలో ముఖ్యంగా ఈ జిల్లాల్లో.. ఖమ్మం, జనగాం, జగిత్యాల, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల ప్రభావంతో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.