Rains : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఈ జిల్లాలు అలర్ట్…
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

Rain forecast for Telugu states.. These districts are on alert...
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు ఉన్నాయని.. ఎప్పుడైనా పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
ఏపీ, తెలంగాణలో ఎండలు భారీగా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. తెలంగాణలో పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కాగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు వరకు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. భారీ ఎండలు వడగాల్పులు వేయొచ్చు. దీని వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.. అందుకే పొద్దుపొద్దునే లేదా సాయంత్రం పూట ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పనులు చక్క పెట్టుకుంటున్నారు.
ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు.. వర్షాలు కూడా పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంటోంది. అయితే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమే.. చెప్పుకొచ్చింది వాతావరణ శాఖ.. 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా వచ్చే రెండు రోజులు వేడి, తేమతో కూడిన పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడిన ఈదురు గాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ జిల్లాలకు అలర్ట్..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది. కొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉండొచ్చని తెలిపింది.