Weather Update : గ్రేటర్ హైదరాబాద్లో వర్షలు.. సాయంత్రం భారీ వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గ్రేటర్ HYDలో శనివారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో దంచి కొడుతోంది.

Rains in Greater Hyderabad.. Heavy rain in the evening
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గ్రేటర్ HYDలో శనివారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో దంచి కొడుతోంది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. రెండు మూడు రోజులుగా కురిసిన వానకు పలు ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అలాగే రుతపవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.