Weather update : నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు… ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.

Rains in Telugu states today... Rains with thunder in these districts
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
26 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు
ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కారణంగా పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షాలు, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
తెలంగాణకు రెయిన్ అలర్ట్..
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే నైరుతి రుతపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంగా భారీగా ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షానికి అవకాశం ఉందన్నారు.