Raj tharun Lavanya : రాజ్ తరుణ్ లవర్ ఆత్మహత్య ప్రయత్న…
రాజ్ తరుణ్ లావణ్య ల విషయంలో అర్ధరాత్రి పూట పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణం లావణ్య తీసుకున్న నిర్ణయం.

Raj Tarun's lover suicide attempt...
రాజ్ తరుణ్ లావణ్య ల విషయంలో అర్ధరాత్రి పూట పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణం లావణ్య తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు ఈ విషయం తెలుగు నాట సంచలనం సృష్టిస్తుంది.
ఆత్మహత్య చేసుకుంటున్నాను..నా చావుకి రాజ్ తరుణ్ తల్లి తండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా కారణం అంటూ లావణ్య ఎమర్జన్సీ నెంబర్ అయిన 112 కి కాల్ చేసి చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా కలవరపాటుకి గురయ్యారు. వెంటనే లావణ్య నివాసానికి వెళ్లి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపారు. ఆ పై సమస్యకి పరిష్కారం ఆత్మహత్య కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా లావణ్య తన ఆవేదనని వ్యక్తం చేసింది. సిస్టమ్ ని నమ్మాను. కానీ ఫెయిల్ అయ్యాయని అనిపిస్తుంది. న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా పోయింది. .కానీ ఇన్ని రోజులు సహకరించిన వాళ్లకి ధన్యవాదాలు.
రాజ్ మాత్రం మాల్వి మల్హోత్రా తో జల్సా లు చేస్తున్నాడు. పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు. రాజ్ లేని లైఫ్ ని ఉహించుకోలేను అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. మరి ఈ విషయం ఎక్కడి దాకా వెళ్తుందో ఎవరకి అర్ధం కావటం లేదు.రాజ్ తరుణ్ మీద అయితే కొన్ని రోజుల క్రితం పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది.