Rajamouli biopic : నెట్‌ఫ్లిక్స్‌లో రాజమౌళి బయోపిక్.. హీరో ఎవరంటే
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఎవరూ అంటే అంతా చెప్పే పేరు ఒక్కటే.. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఎవరూ అంటే అంతా చెప్పే పేరు ఒక్కటే.. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి. తెలుగు సినిమాల గురించి ఇవాళ ప్రంపంచం మొత్తం మాట్లాడుకుంటున్నారు అంటే.. అందులో రాజమౌళిదే కీలక పాత్ర. బాహుబలితో పాన్ ఇండియా అనే ఫార్ములాను తీసుకువచ్చి.. ఇండియా అంటే బాలీవుడ్ మాత్రమే కాదని ప్రపంచానికి అర్థమయ్యేలా చేశాడు. తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టే జక్కన్నకు మార్కెట్ ఇంత క్రేజ్ ఉంది.
ఇప్పటి వరకూ అంతా జక్కన్న తీసిన సినిమా చూశారు. కానీ త్వరలోనే స్వయంగా జక్కన్న స్టోరీనే చూడబోతున్నారు. అవును.. త్వరలోనే ఎస్‌ఎస్ రాజమౌళి బయోపిక్ రాబోతోంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ అరుదైన ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి స్ట్రీమింగ్‌కి సంబంధించిన వివరాలతో పాటు పోస్టర్‌ను రిలీజ్ చేసింది. మోడ్రన్ మాస్టర్ పేరుతో ఈ డాక్యుమెంటరీ తీస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఇందులో రాజమౌళి విజన్, తన విభిన్నమైన మేకింగ్ స్టైల్, అతను సినిమా తీయడం కోసం తెరా వెనక పడే కష్టాన్ని చూపించనున్నారు. ‘ఒక మేకర్ నుంచి అనేక బ్లాక్‌బస్టర్‌లు, అతని అంతులేని ఆశయం, పడే తపన ఎలాంటిదో.. ఇంతలా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు ? ఎన్ని సంవత్సరాలు పట్టింది ? ఇలాంటి అన్ని అంశాలతో ‘మోడ్రన్ మాస్టర్స్’ రూపుదిద్దుకుంది. అనుపమా చోప్రా రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ.. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ డాక్యుమెంటరీకి రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించగా.. తన్వి అజింక్యా సహ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఇందులో తెలుగు సినిమా నటుల నుండి అంతర్జాతీయ నటుల వరకు రాజమౌళిపై వారికి ఉన్న తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జక్కన్న ఫ్యాన్స్ అంతా ఈ డాక్యుమెంటరీ కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.