SS. Rajamouli : అమ్మో రాజమౌళి మళ్ళీనా…? ఆ హీరో ఫాన్స్ గుండెల్లో రైళ్ళు…?
ఇండియన్ (Indian) సినిమాలో రాజమౌళి (Rajamouli) పేరు మార్మోగిపోతుంది. బాహుబలి (Baahubali) సినిమా తర్వాతి నుంచి రాజమౌళి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.

Rajamouli's name is legendary in Indian cinema. After Baahubali movie, Rajamouli is being talked about a lot.
ఇండియన్ (Indian) సినిమాలో రాజమౌళి (Rajamouli) పేరు మార్మోగిపోతుంది. బాహుబలి (Baahubali) సినిమా తర్వాతి నుంచి రాజమౌళి గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తో ఎలా అయినా సినిమా చేయాలని చాలా మంది యువ హీరోలు ఎదురు చూస్తున్నారు. సీనియర్ హీరోలు సైతం రాజమౌళి కోసం కష్టపడుతున్న పరిస్థితి ఉంది. హీరోలకు ఏ స్థాయిలో ఇమేజ్ ఉందో రాజమౌళికి కూడా అదే స్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు ఒక వార్త ప్రభాస్ అభిమానులను కంగారు పెడుతోంది.
అదే ప్రభాస్ (Prabhas) తో మరో సినిమా రాజమౌళి చేస్తున్నారని… అవును ఇప్పుడు ఈ ప్రచారం ప్రభాస్ ఫాన్స్ (Prabhas Fans) గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది. రాజమౌళి తో సినిమా అంటే సంతోషమే కదా మరి… కంగారు ఎందుకు అంటారా…? బాహుబలి సినిమా చేసిన తర్వాత ప్రభాస్ మరో సినిమా చేయడానికి ఆరేళ్ళు పట్టింది. ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆరు నెలలకు ఒక సినిమా విడుదల చేయాలనే టార్గెట్ పెట్టుకుని ప్రభాస్ ఇప్పుడు పని చేస్తున్నాడు. గతంలో కూడా ప్రభాస్ ఇలా సినిమాలు చేయలేదు.
మరి ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్ గా చేస్తున్నాడు అనేది చర్చనీయాంశం అయింది. రాజమౌళి తో ఒక సినిమాను మరో రెండేళ్ళలో మొదలుపెట్టే ప్లాన్ లో ఉన్నాడట. ఆ సినిమా మొదలుపెడితే కనీసం రెండేళ్లకు పైగా పట్టే అవకాశం ఉండటంతో ప్రభాస్ ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తున్నాడని టాక్. ప్రస్తుతం రాజమౌళి… మహేష్ బాబు (Mahesh Babu) తో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తున్నారు. తర్వాతి జక్కన్న ప్రాజెక్ట్ (Jakkanna Project) ఏంటీ అనేది క్లారిటీ లేదు. అది కచ్చితంగా ప్రభాస్ ప్రాజెక్ట్ అని. అందుకే ఇప్పుడు త్వరగా సినిమాలు చేస్తున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.