BJP MLA Rajasingh : శోభాయాత్ర చేస్తే చంపేస్తాం.. రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు..
రాజాసింగ్ (Raja Singh) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహిష్కరించి.. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా.. ఆయన బీజేపీ (BJP MLA) తరఫున గెలిచారు అంటే.. రాజాసింగ్ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డ్ క్రియేట్ చేసిన రాజాసింగ్‌కు.. పక్కా హిందూ నేతగా (Hindu Leader) మంచి ఫాలోయింగ్ ఉంది.

Rajasingh is threatened once again if he performs Shobhayatra.
రాజాసింగ్ (Raja Singh) ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహిష్కరించి.. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా.. ఆయన బీజేపీ (BJP MLA) తరఫున గెలిచారు అంటే.. రాజాసింగ్ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డ్ క్రియేట్ చేసిన రాజాసింగ్‌కు.. పక్కా హిందూ నేతగా (Hindu Leader) మంచి ఫాలోయింగ్ ఉంది. ఎంఐఎంను, ఒవైసీ బ్రదర్స్ (Owaisi Brothers) ను తిట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా అంటారు రాజకీయం పరిచయం ఉన్న వాళ్లు. గోరక్షణ కోసం ఎంతకైనా తెగించే నాయకుడిగానూ రాజాసింగ్‌కు పేరు ఉంది. తన నియోజకవర్గంలో ఏటా రామనవమి రోజు.. భారీ స్థాయిలో శోభాయాత్ర నిర్వహిస్తుంటారు ఆయన.
ఐతే ఇప్పుడు రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ (Threatening calls) వచ్చాయ్. రామనవమి శోభాయాత్ర చేస్తే.. చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు. ఐతే ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని.. తనను బెదిరించిన వాళ్లకు సవాల్ విసిరారు రాజా సింగ్. 7199 942 827, 4223 532 270 నంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ వివరించారు. గతంలో కూడా ఇదే తరహాలో రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయ్.
అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట వేళ.. రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిరోజుల కింద.. అప్పటి రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు రాజాసింగ్ లేఖ రాశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో వివరించారు. ఇప్పటివరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో తెలిపారు. తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా (Social media) వేదికగా కూడా చెప్పారు. ఐతే ఇప్పుడు మళ్లీ బెదిరింపు కాల్స్ రావడంతో.. కొత్త చర్చకు కారణం అవుతోంది.