Rajasthan CM, Bhajanlal Sharma : రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ.. అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం..
ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాలో కాషాయం జెండా ఎగరవేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయభేరి మోగించింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు సీఎంలను ప్రకటిస్తోంది. మధ్యప్రదేశ్ కు మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. నేడు రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Rajasthan CM swearing in midnight tonight.. Luck comes to you.. First time win as MLA.. Bhajanlal Sharma as Rajasthan CM
ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాలో కాషాయం జెండా ఎగరవేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయభేరి మోగించింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు సీఎంలను ప్రకటిస్తోంది. మధ్యప్రదేశ్ కు మోహన్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన బీజేపీ హైకమాండ్.. నేడు రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నేడు రాజస్థాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, డీప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ భైర్వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాష్ట్ర గవర్నర్ కల్ రాజ్ మిశ్రా హాజరుకానున్నారు. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నిక.. మంత్రి భజన్ లాల్ శర్మ తన 56వ పుట్టిన రోజే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జైపూర్‌లో ఆల్బర్ట్ హాల్‌లో శుక్రవారం ఇవాళ అర్ధరాత్రి 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రమాణస్వీకారోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జైపూర్ రోడ్లకు ఇరువైపుల పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి.
రాజస్థాన్‌లో విడుదలైన ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ 115 సీట్లను గెలుచుకుంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి 69 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తంగా 200 సీట్లకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. బీజేపీ విజయం సాధించిన తర్వాత కేంద్ర అధిష్ఠానం భజన్ లాల్ శర్మ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
భజన్ లాల్ శర్మ సంగనీర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భజన్ లాల్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు.