RAJINI SAI CHAND: ఫొటో తీసేసి అవమానిస్తారా.. సాయిచంద్ భార్య కన్నీళ్లు
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్న సాయిచంద్ భార్య రజినీ పదవి కూడా రద్దు అయింది. దీనిపై రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయ్. రజనీని బీఆర్ఎస్ మహిళగా కాకుండా ఉద్యమకారుడి భార్యగా చూడాలని.. ఆమెను అదే పదవిలో కొనసాగించాలనే డిమాండ్ కూడా వినిపించింది.
RAJINI SAI CHAND: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో తన టీమ్ రెడీ చేసుకుంటున్నారు సీఎం రేవంత్. ఐపీఎస్‌ల బదిలీలు జరిగిపోయాయ్. కొన్ని రివ్యూ మీటింగ్‌ల తర్వాత ఐఏఎస్‌లకు కూడా ట్రాన్స్‌ఫర్స్ తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరి బదిలీలు జరిగాయి. ఇదంతా ఎలా ఉన్నా.. బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
YS JAGAN: వైసీపీకి దూరమవుతున్న రెడ్లు.. బీసీ ఓట్ బ్యాంక్‌పై జగన్ నజర్..
కేసీఆర్ ప్రభుత్వం నియమించిన 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ప్రభుత్వం నియమించిన 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్న సాయిచంద్ భార్య రజినీ పదవి కూడా రద్దు అయింది. దీనిపై రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయ్. రజనీని బీఆర్ఎస్ మహిళగా కాకుండా ఉద్యమకారుడి భార్యగా చూడాలని.. ఆమెను అదే పదవిలో కొనసాగించాలనే డిమాండ్ కూడా వినిపించింది. ఐతే రేవంత్ సర్కార్ నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. దీంతో రజనీ కూడా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఐతే గిడ్డంగుల సంస్థ ఆఫీస్‌లో చివరి రోజు జరిగిన పరిణామాలకు రజనీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆఫీస్‌లో సాయిచంద్ ఫొటో తీయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
స్వయంగా వచ్చి ఫొటో తీసుకెళ్తానని చెప్పానని.. ఐనా సరే గోడ మీద నుంచి సాయిచంద్ ఫొటో తీయడం చాలా బాధగా ఉందని అంటూ.. రజనీ కన్నీటి పర్యంతం అయ్యారు. నిజానికి 2024వరకు తన పదవీకాలం ఉన్నా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధం అయ్యానని.. ఈలోపు తన భర్త ఫొటోను తీసేసి ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రజనీ ఈ వీడియో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఫొటో ఉన్నంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏంటి.. ఓ ఉద్యమకారుడిని.. అదీ చనిపోయిన వ్యక్తిని, ఆయన కుటుంబాన్ని ఇంతలా అవమానించాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.