Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
వివిధ రాష్ట్రాలు కలిపి మొత్తం 56 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా యూపీలో 10 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీతోపాటు బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు సభ్యులకు ఎన్నిక జరగనుంది.
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీని ద్వారా 15 రాష్ట్రాలకు సంబంధించి 56 మంది సభ్యులను ఎన్నుకుంటారు. తాజాగా ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లు సమర్పించేందుకు ఆఖరి తేది ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 16వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు.
PM Modi: పరీక్షా పే చర్చా.. విద్యార్థులకు మోదీ సూచనలు
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి. వివిధ రాష్ట్రాలు కలిపి మొత్తం 56 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా యూపీలో 10 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీతోపాటు బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు సభ్యులకు ఎన్నిక జరగనుంది. ఇక పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లలో ఐదుగురు సభ్యులు, కర్ణాటకలో నలుగురు సభ్యులను ఎన్నుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్‌లో మూడు స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఈ ఎన్నిక జరుగుతుంది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల వివరాలుంటాయి.
ఆ పేర్లలో తనకు నచ్చిన పేరుని ఎమ్మెల్యేలు మార్క్ చేసి బాక్స్‌లో వేస్తారు. తొలిరౌండ్‌లో అవసరమైన మెజార్టీ సాధించిన వ్యక్తి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను క్రమ పద్ధతిలో తొలగిస్తారు. ఆ ఓట్లను ఎమ్మెల్యేల నిర్ణయం ప్రకారం మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. అన్ని ఖాళీలు భర్తీ అయ్యేంత వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.