Rakhi sawant health : గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాఖీ సావంత్
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీసావంత్. గుండె సంబంధిత సమస్యతో ఆమె మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Rakhi Sawant was admitted to the hospital with heart pain
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి రాఖీసావంత్. గుండె సంబంధిత సమస్యతో ఆమె మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఫోటోలు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో రాఖీ సావంత్ (Rakhi Sawant) అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ విష్ చేస్తున్నారు.
ఈ విషయమై రాఖీ సావంత్ సోదరుడు మీడియాతో మాట్లాడారు. రాఖీ సీరియస్ హార్ట్ ప్రోబ్లంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థన చేయాలని కోరారు. ఈ సమయంలో సోదరుడు రాఖేష్ సావంత్ చాలా టెంక్షన్‌గా ఉన్నట్లు కనిపించారు. రాఖీ సావంత్ హేటర్స్ పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆసుపత్రిలో చేరక కొన్ని గంటల ముందుకు కూడా రాఖీ తన ఇన్‌స్టాగ్రాంలో యాక్టివ్‌గా ఉన్నారు. ఫన్నీ రీల్స్ చేసి షేర్ చేశారు. వింత వింతగా ఫోజులు ఇస్తూ, వెరైటీ ఔట్ ఫిట్లలో ఉన్న ఫోటోలు ఆమె స్టోరీల్లో ఉన్నాయి. ఇంతలోనే రాఖీకి ఏమైందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.