Ram Charan: ఇడియట్స్ సెన్సేషన్
ప్రశాంత్ నీల్ చరణ్ తో మూవీ ప్లాన్ చేసుకుంటున్నాడట.

Ram Charan and Rajkumar Hirani combo Movie Direct by Prasaanth Neel
త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్, ఫ్యూచర్ ప్లానింగ్ కాస్త గట్టిగానే ఉన్నట్టుంది. ఎక్కడా తగ్గట్లేదు. ముంబై వెల్లాడు త్రీ ఇడియట్స్, పీకే ఫేం రాజ్ కుమార్ హీరాణీని కలిశాడు. తనతో మూవీని ఆల్ మోస్ట్ ఓకే చేసుకున్నాడు.
ఇప్పుడు వెళ్లింది కేవలం స్టోరీ డిస్కర్షన్స్ కోసమే అని తెలుస్తోంది. ఓవైపు ధోనీతో యాడ్ షూట్ అంటూనే, మరో వైపు రాజ్ కుమార్ హీరాణీ తో కథా చర్చలు. ఇది అసలు సంగతి. షారుఖ్ ఖాన్ తో రాజ్ కుమార్ హీరాణీ తీస్తున్న డంకీ తర్వాత చరణ్ తోనే తన మూవీ అని తెలుస్తోంది. 2024 సంక్రాంతికి ఈప్రాజెక్ట్ పట్టాలెక్కేఛాన్స్ ఉంది.
ఆల్రెడీ అరవ అడ్డాలో టాప్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో గేమ్ ఛేంజర్ మూవీచేస్తున్నాడు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఓ మూవీ కమిటయ్యాడు. నిజానికి దేవర తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా అన్నారు. కాని దేవర 2 వల్ల తారక్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. దీంతో ప్రశాంత్ నీల్ చరణ్ తో మూవీ ప్లాన్ చేసుకుంటున్నాడట.
ఇలా చూస్తే ఒక్క బుచ్చి బాబు మూవీ తప్ప చరణ్ చేస్తున్న శంకర్ సినిమా ,చేయబోతున్న ప్రశాంత్ నీల్ మూవీ, ప్లాన్ చేస్తున్న రాజ్ కుమార్ హీరాణీ సినిమా.. ఈ లిస్ట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఒక్కో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అనుకున్న వాళ్లతో మెగా పవర్ స్టార్ భారీగానే కెరీర్ ని డిజైన్ చేసుకుంటున్నాడు.