RAM GOPAL VARMA: అరెస్ట్‌ చేయండి సార్‌.. చంపుతామని బెదిరిస్తున్నారు.. ఏపీ డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు

ఏపీ సీఎం జగన్‌ లైఫ్‌ హిస్టరీ ఆధారంగా ఆర్జీవీ వ్యూహం పేరుతో సినిమా చేశారు. ఈ సినిమాలో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ క్యారెక్టర్లను కూడా పెట్టారు. దీనిపై టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సినిమా రిలీజ్‌ కాకుండా చూడాలంటూ నారా లోకేష్‌ కోర్టులో కేసు కూడా వేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 05:51 PMLast Updated on: Dec 27, 2023 | 5:51 PM

Ram Gopal Varma Complained On Kolikapudi Srinivas Over Death Threats

RAM GOPAL VARMA: వివాదాస్పద కామెంట్స్‌ చేసి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోతాడు. కానీ అలాంటి ఆర్జీవీకి టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ షాకిచ్చారు. రామ్‌గోపాల్‌ వర్మ తల నరికి తీసుకువస్తే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ బహిరంగా ప్రకటన చేశారు. ఏపీ సీఎం జగన్‌ లైఫ్‌ హిస్టరీ ఆధారంగా ఆర్జీవీ వ్యూహం పేరుతో సినిమా చేశారు.

 Devil Movie Update : డెవిల్‌తో ఫైనల్ టచ్

ఈ సినిమాలో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ క్యారెక్టర్లను కూడా పెట్టారు. దీనిపై టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ సినిమా రిలీజ్‌ కాకుండా చూడాలంటూ నారా లోకేష్‌ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ కేసు తేలేవరకూ సినిమా రిలీజ్‌ చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. దీంతో వ్యూహం సినిమాకు బ్రేక్‌ పడింది. ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ “ఆర్జీవీ పరాన్నజీవి” పేరుతో చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొలికపూడి శ్రీనివాస్‌ కూడా వచ్చారు. ఆర్జీవీ గురించి విమర్శలు చేస్తూ.. అతని తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ కామెంట్‌ చేశారు. ఇదే క్లిప్పింగ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు ఆర్జీవీ.

టీవీ యాంకర్‌ ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడించారని ఇద్దరిపై కేసు పెడతానంటూ పోస్ట్‌ చేశాడు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ స్పందించలేదంటే వాళ్లు కూడా శ్రీనివాస్‌కు మద్దతు తెలిపినట్టేనంటూ వరుస పోస్ట్‌లు చేశాడు. నేరుగా ఏపీ డీజీపి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్‌ను, అతనితో ఆ కామెంట్స్‌ చేయించిన టీవీ యాంకర్‌ను కూడా అరెస్ట్‌ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి పోలీసులు ఈ విషయంలో ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారో చూడాలి.