Ram Potineni: ప్రమోషన్ కనిపించని స్కంద.. ఇదేం పాన్ ఇండియా మూవీ
స్కంద సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రమోషన్ కనిపించడంలేదు.

Ram Pothineni and Srilila Pradana's film Skanda is not doing any promotions
పాన్ ఇండియన్ సినిమా అంటే ప్రమోషన్ ఎలా ఉండాలంటే.. ఒక రేంజ్ లో మోత మోగిపోవాలి. రెండు నెలల ముందు నుంచి ప్రమోషనల్ కంటెంట్ రీసౌండ్ చేయాలి. కానీ స్కంద విషయంలో ఈ హడవిడి కనిపించడం లేదు. రిలీజ్ కి ఇంకా 10 రోజులే టైం ఉన్నా మేకర్స్ సడిచప్పుడు చేయడం లేదు. రామ్, బోయపాటి కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ స్కంద. సరిగ్గా ఇంకో 10 రోజులో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 28న సౌత్ ,నార్త్ లో రిలీజ్ కానుంది. కానీ పాన్ ఇండియన్ సినిమాకు ఉండాల్సిన సందడి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కంటెంట్‌పై నమ్మకమో లేక స్టార్ పవర్‌పై థీమానో కానీ టీం మొత్తం సైలెంట్‌గా ఉంది.
ఓ ట్రైలర్.. నాలుగు పాటలు మినహాయిస్తే స్కంద ఈవెంట్స్ ఏం జరగడంలేదు. సెప్టెంబర్ 28న చంద్రముఖి 2 మినహా పెద్దగా కాంపిటీషన్ లేదు. అది కూడా రామ్, బోయపాటి రేంజ్ కాదు. పెదకాపు 1 వస్తున్నా.. స్టార్ పవర్ తక్కువ. అయినా కూడా ఛాన్స్ తీసుకోవడానికి స్కంద టీం ముందుకు రావడంలేదు. తెలుగులో ఈ ప్రాజెక్ట్ కి డిమాండ్ ఉన్న.. మిగిలిన భాషలకు స్కంద చిన్న సినిమానే. అక్కడైనా ప్రమోషన్ చేయాలి. అది కూడా జరగడం లేదు. రెడ్, వారియర్ ప్లాప్ అవ్వడంతో రామ్ కెరీర్ కి స్కంద కీలకం. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్. కానీ ప్రమోషన్స్ విషయంలో ఎందుకో వెనకబడుతున్నాడు. మరి వచ్చే 10 రోజుల్లో స్కంద టీం ఎంత వరకు అలర్ట్ అవుతుందో.. ఎలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేస్తుందో చూడాలి.