Ram Setu 1507 : రామ సేతు వంతెన నిజమే ! ఆ రహస్యం బయటపెట్టిన ఇస్రో

భారత్- శ్రీలంక మధ్య రామసేతు వంతెన ఊహే...అంతా ట్రాష్ అని కొందరు కొట్టిపారేస్తుంటారు. హిందువులు మాత్రం... శ్రీరాముడు వానరుల సాయంతో నిర్మించిందే ఈ రామసేతు.. అని బలంగా నమ్ముతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 15, 2024 | 12:41 PMLast Updated on: Jul 15, 2024 | 12:41 PM

Rama Setu Bridge Is Real Isro Revealed That Secret

 

 

భారత్- శ్రీలంక మధ్య రామసేతు వంతెన ఊహే…అంతా ట్రాష్ అని కొందరు కొట్టిపారేస్తుంటారు. హిందువులు మాత్రం… శ్రీరాముడు వానరుల సాయంతో నిర్మించిందే ఈ రామసేతు.. అని బలంగా నమ్ముతారు. ఇప్పుడు ఇస్రో కూడా అది ఊహాజనితం కాదు… నిజమే అని డిక్లేర్ చేసింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటా ఆధారంగా తమిళనాడులో ఈ బ్రిడ్జికి సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ బ్రిడ్జి పొడవు 29 కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా వేశారు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉంది. రైలు కోచ్ అంత పరిమాణంలో నీళ్ళల్లో మునిగిన బ్రిడ్జి భాగానికి సంబంధించి 10 మీటర్ల రిజల్యూషన్ తో మ్యాప్ తయారు చేసింది ఇస్రో.

రామసేతు వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ ద్వీపంలోని తలైమన్నార్‌ వరకు విస్తరించి ఉందని ఇస్రో నిర్ధారించింది. ఈ బ్రిడ్జిని సున్నపు రాయితో నిర్మించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రామ సేతు 99శాతం నీటిలో మునిగి ఉందని ఇస్రో సైంటిస్టులు తేల్చారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జల సంధి మధ్య ప్రవహించే నీళ్ళల్లో 11 చోట్ల ఇరుకైన మార్గాలు కూడా ఉన్నాయట. ఒకప్పుడు భారత్, శ్రీలంక మధ్య భూ సంబంధం కూడా ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరేళ్ళ డేటాను ఇస్రో సేకరించింది. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ శాస్త్రవేత్తలు రామసేతు బ్రిడ్జిపై పరిశోధన చేశారు. హిందువులు మాత్రం… రామాయణ కాలంలో లంకాధీశుడు రావణుడు… సీతమ్మవారిని అపహరించి… లంకలో దాచాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుంటాడు. ఆ తర్వాత లంకకు చేరేందుకు… సముద్రంపై వానరసేన సాయంతో వంతెన నిర్మించినట్టు చెబుతారు. ఆ రామ సేతు మీద నుంచే వానరసేన లంకకు చేరుకుంది. క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ బ్రిడ్జిని సేతు బంధై అని పిలిచేవారు. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ బ్రిడ్జి 1480లో తుఫానులతో పూర్తిగా ధ్వంసమైందని ఉంది. అప్పటి వరకూ కూడా సముద్ర మట్టానికి పైనే బ్రిడ్జి ఉందని అంటున్నారు.

రామసేతు బ్రిడ్జి కోసం ఉపయోగించిన రాళ్ళు ఇప్పటికీ నీళ్ళపై తేలుతున్నట్టు రామేశ్వరం ప్రజలు చెబుతుంటారు. 2004లో సునామీ వచ్చినప్పుడు రామేశ్వరం ఏరియాలో చాలా చోట్ల ఈ రాళ్ళు కనిపించాయట. ఇది రాముడు నిర్మించిన… రామసేతునే అనే జనం నమ్మకాన్ని తొలగించేందుకే… ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆడం బ్రిడ్జి అని పేరు పెట్టినట్టు ఆరోపణలున్నాయి. రామాయణం నిజంగా జరగలేదు… అది ఇతిహాసం… ఓ కట్టు కథ అని నమ్మించేందుకు ఆడమ్ బ్రిడ్జి పేరు పెట్టారని చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. 1788లో ఆస్ట్రేలియాకి చెందిన బొటానికల్ ఎక్స్ ప్లోరర్ జోసెఫ్ పార్క్ పరిశోధనలతో… ఈస్టిండియా కంపెనీకి చెందిన మొదటి సర్వేయర్ జనరల్ జేమ్స్ ఓ మ్యాప్ గీశాడు… దాని ఆధారంగానే ఆడమ్స్ బ్రిడ్జి అనే పేరు వచ్చింది. 2017డిసెంబర్ లో అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానెల్ కూడా ఇది మానవ నిర్మితమేనని తేల్చింది. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడలేదు… అక్కడి ఇసుకపై రాళ్ళు పేర్చారని పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇసుక 4 వేల ఏళ్ళ నాటిది… రాళ్ళు 7 వేల ఏళ్ళ నాటివి అని తేల్చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే దీనిని సూపర్ హ్యూమన్ అచీవ్‌మెంట్ అని చెప్పింది సైన్స్ ఛానెల్. వాటిని నిజంగా రాముడి ఆధ్వర్యంలో వానర సైన్యం నిర్మించిందా… ఆ రాళ్ల వెనకున్న అసలు కథేంటి… అనేవి ఇంకా మిస్టరీగానే ఉంది.