Alia’s saree Ramayana : ఆలియా చీర కొంగులో రామాయణం.. అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా బ్యూటీ..
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం. దేశంలోని ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. వీరిలో సినీ రంగానికి చెందినవారికి కూడా ఇన్విటేషన్ వెళ్లింది. అయితే ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారిలో చాలామంది.. అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూడా ఉంది. భర్తతో కలిసి ఆలియా భట్ ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Ramayana in Alia's saree Kongu.. Beauty is a special attraction in Ayodhya..
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం. దేశంలోని ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. వీరిలో సినీ రంగానికి చెందినవారికి కూడా ఇన్విటేషన్ వెళ్లింది. అయితే ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారిలో చాలామంది.. అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూడా ఉంది. భర్తతో కలిసి ఆలియా భట్ ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆలియా ధరించిన చీర విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె చీరపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మక అయోధ్య కార్యక్రమానికి హాజరైన ఆలియా.. మేకోవర్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. రామాయణం ఇతివృతం ఆధారంగా ఆమె చీర ఉంది. దీంతో ఫొటోగ్రాఫర్లు ఆమె చీరపైనే కెమెరాలు ఉంచారు. ఆమె ధరించిన చీర కొంగుపై రామాయణాన్ని వివరించే అంశాలు ఉన్నాయ్. దీంతో ఆ చీర ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. సింపుల్ నీలి రంగు చీరలో ఆలియా మెరిసింది. అయితే చీర కొంగు అంచుపై రామాయణాన్ని కళ్లకు కట్టే చిత్రాలు, అక్షరాలు ఉన్నాయ్. అంతేకాదు దానిపై రామసేతు, హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు కొందరు గుర్తించారు.
ఆలియా ఏ కార్యక్రమానికి వెళ్లినా తన వస్త్రధారణలో స్పెషాలిటీ చాటుకుంటుంది. అయోధ్య పర్యటనలోనూ ప్రత్యేక శ్రద్ధతో చీరను రూపొందించుకున్నారని ఫ్యాషన్‌ప్రియులు చెప్తున్నారు. రామాయణంతో ఆలియాకు కొంత అనుబంధం ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఆలియా భట్ నటించింది. అందులో ఆమె పాత్ర పేరు సీత అని ఉండడం విశేషం. రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించిన ఆలియా భట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే ఆలియా ధరించిన చీర ఎక్కడ లభిస్తుందోనని ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించారు.