Ramcharan : హాలీవుడ్‌లో రాంచ‌ర‌ణ్ సూపర్ క్రేజ్

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మెగా ప‌వ‌ర్ స్టార్ (Mega Power Star) రామ్ చ‌ర‌ణ్ (Ramcharan) క్రేజ్ గ్లోబ‌ల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఈ సినిమా హాలీవుడ్ (Hollywood) లో సూప‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 2, 2024 | 10:53 AMLast Updated on: Mar 02, 2024 | 10:53 AM

Ramcharan Is Super Craze In Hollywood

 

 

 

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో మెగా ప‌వ‌ర్ స్టార్ (Mega Power Star) రామ్ చ‌ర‌ణ్ (Ramcharan) క్రేజ్ గ్లోబ‌ల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఈ సినిమా హాలీవుడ్ (Hollywood) లో సూప‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ ప్ర‌పంచ‌స్థాయి గుర్తింపును పొందారు. రామరాజు పాత్రకు రామ్‌చ‌ర‌ణ్‌.. భీం పాత్రల‌కు తార‌క్ ప్రాణం పోసారు. త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేయ‌డానికి ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డారు. ఆ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితంగా ఇద్ద‌రూ గ్లోబ‌ల్ స్టార్స్‌గా ఎదిగిపోయారు.. ముఖ్యంగా రామ‌రాజు పాత్ర‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా చెర్రీ యాక్టింగ్‌కు హాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది.

చెర్రీ లుక్‌, ఫిట్‌నెస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మందిని ఫిదా చేసింది. చెర్రీతో ఫొటోల కోసం అక్క‌డి ప్ర‌జ‌లే కాదు.. హాలీవుడ్ ప్ర‌ముఖులు సైతం ఇంట్రెస్ట్ చూపించ‌డం ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. అప్ప‌టి నుంచి చెర్రీ క్రేజ్ కొన‌సాగుతూనే ఉంది. ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు చెర్రీని వ‌రించాయి. ఆ క్రేజ్ కొనసాగిస్తూ గ్లోబల్ వైడ్ గా చరణ్ క్రేజ్‌ను మరోసారి చాటి చెప్పేలా ఓ హాలీవుడ్ మూవీ ఆడిష‌న్ కాల్ ఇచ్చింది. హాలీవుడ్‌ని షేక్ చేస్తున్న చ‌ర‌ణ్ క్రేజ్‌ను చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఒక హాలీవుడ్ సినిమాకు కాస్టింగ్ కాల్ ఇస్తూ నటీనటులకు కావాల్సిన క్వాలిటీస్ ని ఫోటో రూపంలో చూపించారు. అందులో ట్రిపుల్ ఆర్‌లో రామ్ చరణ్ నటించిన పోలీస్ ఫోటో వేసారు. అలాంటి లుక్, ఫిజిక్ ఉన్న నటీనటులు కావాలంటూ ప్ర‌క‌టన ఇచ్చారు. ఈ విష‌యం కాస్తా ఇప్పుడు ఫిలిం ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్ పాత్ర ఎంతగా ఇంపాక్ట్ చేసిందో చెప్ప‌డానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు సినీ పెద్ద‌లు.. ఆ పాత్ర కోసం చరణ్ తెర వెనుక పడిన కష్టం చాలా గొప్పద‌ని… అందుకే అతనికి అంత గొప్ప గుర్తింపు వచ్చేలా చేసింద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఈ విష‌యం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. హాలీవుడ్‌లో చ‌ర‌ణ్ క్రేజ్ మ‌రోసారి ప్రూవ్ అయ్యిందంటూ ఈ న్యూస్‌ను తెగ వైర‌ల్ చేస్తున్నారు.

ఇక చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం భారీ సినిమాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజ‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. చెర్రీ-శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచ‌నాలున్నాయి.

ఈ చిత్రం తరువాత రామ్ చరణ్ కమిట్ అయిన చిత్రం RC16. ఈ చిత్రం కి ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. RC16 పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్- డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మ‌రి.. ట్రిపుల్ ఆర్‌తో వ‌చ్చిన స్పెష‌ల్ క్రేజ్‌ను చెర్రీ త‌న నెక్ట్స్ మూవీస్‌తో ఎలా నిల‌బెట్టుకుంటాడో చూడాలి మ‌రి..