Ramulamma Yekkada : రాములమ్మ ఎక్కడ ? మళ్ళీ సినిమాలేనా…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి... కాంగ్రెస్ లో చేరారు నటి విజయశాంతి. ఆ పార్టీ తరపున ఒకరిద్దరు అభ్యర్థుల తరపున... అక్కడక్కడా ప్రచారం చేశారు. లోక్ సభలో మెదక్ తరపున కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2024 | 10:30 AMLast Updated on: Jun 27, 2024 | 10:30 AM

Where Is Telangana Lady Superstar Ramulamma Movie Again

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి… కాంగ్రెస్ లో చేరారు నటి విజయశాంతి. ఆ పార్టీ తరపున ఒకరిద్దరు అభ్యర్థుల తరపున… అక్కడక్కడా ప్రచారం చేశారు. లోక్ సభలో మెదక్ తరపున కాంగ్రెస్ టిక్కెట్ ఆశించారు. కానీ హైకమాండ్ ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో… సార్వత్రిక ఎన్నికల్లో అస్సలు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం కూడా చేయలేదు. ఎన్నో ఆశలతో హస్తం పార్టీలో చేరినా… విజయశాంతిని కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీలో పదవి ఇచ్చినా… ఆ తర్వాత ఆమె రోల్ ఏంటి అన్నది తెలియలేదు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయన్న ఆశ కూడా కనిపించట్లేదు. దాంతో చేసేది లేక రాములమ్మ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.

లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి గతంలో పవర్ ఫుల్ పాత్రలే చేశారు. హీరోలు మాత్రమే ఫైట్ చేసే రోజుల్లో… హీరోయిన్లూ చేస్తారని ప్రూవ్ చేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేసి… జనాన్ని మెప్పించారు. ఈమధ్యకాలంలో ఆమె నటించింది… మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీలోనే. ఆ సినిమాలో విజయశాంతికి పవర్ ఫుల్ రోల్ ఇచ్చారు. ఆ తర్వాత పాలిటిక్స్ లో పార్టీలు మారడంలో బిజీ అయ్యారు. దాంతో మూవీ ఛాన్సులేవీ రాలేదు. లేటెస్ట్ గా నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాలో ఈ లేడీ సూపర్ స్టార్ కి ఛాన్స్ దక్కింది. అది కూడా చాలా యేళ్ళ తర్వాత పోలీస్ రోల్ లో కనిపించింది.

విజయశాంతి బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ వదిలారు. అందులో రాములమ్మ పోలీస్ రోల్ లో… వైజయంతి కేరక్టర్ లో కనిపించబోతున్నట్టు అర్థమైంది. చాలా కాలం గ్యాప్ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇస్తోంది రాములమ్మ. అది ఫుల్ లెంత్ రోలా… గెస్ట్ రోలా అన్నది తెలియదు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా ఉన్న విజయశాంతి… ఇప్పుడైనా పూర్తిగా సినిమాల్లో కంటిన్యూ అవుతారా… లేదంటే ఇక్కడ కూడా పార్ట్ టైమ్ నటిగానే మిగిలిపోతారా అన్నది చూడాలి.