Vijay Shanti : రాములమ్మ సెకండ్ ఇన్నింగ్స్ షురూ…?
లేడీ సూపర్ స్టార్ (Lady Superstar) విజయశాంతికి ఒకప్పుడు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాములమ్మ (Ramulamma) సినిమా విడుదల అవుతుంది అంటే స్టార్ హీరోలు (Star heroes) కూడా తమ సినిమాలను వాయిదా వేసిన పరిస్థితి.
లేడీ సూపర్ స్టార్ (Lady Superstar) విజయశాంతికి ఒకప్పుడు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రాములమ్మ (Ramulamma) సినిమా విడుదల అవుతుంది అంటే స్టార్ హీరోలు (Star heroes) కూడా తమ సినిమాలను వాయిదా వేసిన పరిస్థితి. ఇండియన్ సినిమాకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సరైన అర్ధం చెప్పింది రాములమ్మ. స్టార్ హీరోలు కూడా చేయలేని యాక్షన్ సన్నివేశాలను ఎంతో సులువుగా చేస్తూ అగ్ర దర్శకులను సైతం తన నటనతో కట్టి పడేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్ (Tollywood) లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఆమె సినిమాలకు ఆదరణ ఉండేది.
ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుందని భావించినా ఎందుకో వెనకడుగు పడింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఒక సినిమాను డైరెక్ట్ చేసేందుకు కథ సిద్దం చేసుకుంది రాములమ్మ. ఆ సినిమా కథను ఎప్పుడో సిద్దం చేసుకున్నా ఇప్పుడు మాత్రం… ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా మార్చుకుని నిర్మాతకు కూడా కథ వినిపించారట. ఆ కథను సురేష్ ప్రొడక్షన్స్ సారధ్యంలో నిర్మించే ప్లాన్ లో ఉన్నారట. వెంకటేష్ కు సినిమా కథ వినిపించారట.
ఆయనకు కథ నచ్చిందట. ఆ కథను స్వయంగా సురేష్ బాబు (Suresh Babu) వద్దకు వెంకటేష్ (Venkatesh) రిఫర్ చేసారట. సురేష్ బాబు మాత్రం కొన్ని మార్పులు చెప్పారని, ఆ మార్పులు చేయించి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో ఉన్నారట ఆమె. ఈ సినిమాను సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఆమె తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. సాయి పల్లవికి కూడా త్వరలో కథ వినిపించి ఒప్పించే ఆలోచనలో రాములమ్మ ఉన్నారని, లేడి ఓరియెంటెడ్ సినిమానే రాములమ్మ పట్టాలు ఎక్కించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను కేవలం 12 కోట్ల బడ్జెట్ లో ఆమె ప్లాన్ చేసారట.