బ్రేకింగ్: జానీ మాస్టర్ పై పెట్టిన సెక్షన్లు ఏంటీ…?

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు. తనను లైంగిక వేధిస్తున్నారంటూ పోలీసులకు జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 16, 2024 | 12:21 PMLast Updated on: Sep 16, 2024 | 12:21 PM

Rape Case File On Jonny Master

ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ పై కేసు నమోదు చేసారు రాయదుర్గం పోలీసులు. తనను లైంగిక వేధిస్తున్నారంటూ పోలీసులకు జూనియర్ డాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. జాని మాస్టర్ పై రేప్ కేసు నమోదు చేసారు. పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు.

రాయదుర్గం పోలీసు స్టేషన్ లో సెక్షన్ 376 రేప్ కేసులో పాటు క్రిమినల్ బెదిరింపు (506) గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసులు నమోదు చేసారు. ఈ కేసుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. పలు హిట్ సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేస్తున్నారు.