RAPIDO BIKE: మరీ ఇంత దారుణమా.. మానవత్వం లేదా.. పాపం.. ర్యాపిడో డ్రైవర్..
ఈ సమయంలో సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు..? ఆ ప్రయాణికుడు వేరే బైక్ బుక్ చేసుకుని వెళ్తారు. లేదా పెట్రోల్ బంక్ వరకు బైకు తీసుకెళ్లేందుకు సాయం చేస్తారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం బైక్ దిగలేదట. పెట్రోల్ లేక బైక్ ఆగిపోయినా తనను అలాగే తీసుకెళ్లాలని కోరాడట.
RAPIDO BIKE: సాటి మనిషికి ఇబ్బంది వచ్చినప్పుడు దయ తలచి సాయం చేయడమే మానవత్వం. అయితే, కొందరు ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక ఘటనే దీనికి నిదర్శనం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి ర్యాపిడో బైక్ నడుపుకుంటున్నాడు. మరొకరు ఆ ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నారు. తీరా బైక్‌పై వెళ్తుండగా మధ్యలో పెట్రోల్ అయిపోయింది.
Cyber Crime 1930: తెలంగాణలో రోజుకు 3.30 కోట్ల రూపాయల సొమ్ము.. సైబర్ దొంగల పాలు !
ఈ సమయంలో సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు..? ఆ ప్రయాణికుడు వేరే బైక్ బుక్ చేసుకుని వెళ్తారు. లేదా పెట్రోల్ బంక్ వరకు బైకు తీసుకెళ్లేందుకు సాయం చేస్తారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం బైక్ దిగలేదట. పెట్రోల్ లేక బైక్ ఆగిపోయినా తనను అలాగే తీసుకెళ్లాలని కోరాడట. దీంతో ఆ బైక్ రైడర్ పాపం.. ఆ ప్రయాణికుడిని అలాగే బైక్‌పై కూర్చోబెట్టుకుని, బైక్ తోసుకుంటూ పెట్రోల్ బంక్ వరకు వెళ్లాడు. ఒక్కరు బైక్ తోసుకుంటూ వెళ్లడమే కష్టమైన పని. అలాంటిది బైక్‌పై మరొకరిని కూర్చోబెట్టుకుని, తోసుకుంటూ వెళ్లడం ఇంకా కష్టం. కానీ, బైక్ బుక్ చేసుకున్న ప్రయాణికుడి వల్ల అలా బండిని, అతడిని కూర్చోబెట్టుకుని తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
దీనికి సంబంధించిన దృశ్యాల్ని ఎవరో వీడియో తీయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నిజమేనా.. లేక సరదాగా తీసిందా అని తేలాలి. ఏదేమైనా.. బైక్‌పై కూర్చుని, రైడర్‌ను ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తిని సోషల్ మీడియాలో నెటిజన్లు తిడుతున్నారు. పెట్రోల్ అయిపోయి, ఇబ్బంది పడుతున్న ఆ వ్యక్తికి సాయపడకపోగా.. మరింత కఠినంగా వ్యవహరించిన అతడి తీరును తప్పుబడుతున్నారు.
A man booked two wheeler rental on rapido
During the drive the bike ran of petrol
The passenger did not want to get down
And this is how the rapido rider continued the journey 😭
What is your opinion on this ? pic.twitter.com/N3HKVdzX0s
— Eminent Woke (@WokePandemic) February 11, 2024