Rashmika: రశ్మిక సుడి మామూలుగా లేదు
రశ్మిక పాన్ ఇండియా సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.

Rashmika is rushing with pan India film opportunities including Bollywood
హీరోయిన్ కి తాటికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు. అవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాతీయ స్థాయిలో స్టార్ డమ్ దక్కుతుంది. ప్రజెంట్ ఇలాంటి ఫేజ్ నే ఎంజాయ్ చేస్తోంది ఓ కన్నడ కస్తూరి రశ్మిక. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది.
ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రష్మిక మందన్న గీత గోవిదంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తర్వాత వచ్చిన పుష్పతో నేషనల్ క్రష్ గా మారిపోయింది.బాలీవుడ్ లో మూడు సినిమాలు చేసిన రష్మిక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది.ప్రజెంట్ తన చేతిలో ఉన్న సినిమాలు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానున్నాయి.
ప్రజెంట్ పుష్ప2 షూటింగ్ తో బిజీగా ఉన్న రష్మిక మందన్న బాలీవుడ్ లో యానిమల్ అనే మూవీ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్1న సౌత్ నార్త్ లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అలాగే ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కనున్న D51లో హీరోయిన్ గా ఈ కన్నడ కస్తూరి ఛాన్స్ కొట్టేసింది. నవంబర్ లో ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.
తమిళ స్టార్ హీరో విక్రమ్ తో కలిసి ఓ సినిమా చేయడానికి రష్మిక ఓకే చెప్పిందట. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ‘2018’కి దర్శకత్వం వహించిన జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇక బాలీవుడ్ లో విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించనున్న ‘ఛవా’ అనే హిస్టరికల్ మూవీలో రష్మిక ప్లేస్ కన్ఫామ్ చేసుకుంది. తెలుగులో ‘రెయిన్ బో’ అనే ఉమేన్ సెంట్రిక్ మూవీలో నటిస్తోంది.మొత్తానికి క్రేజీ ప్రాజెక్ట్స్ తో దేశ వ్యాప్తంగా సత్తా చాట్టేందుకు నేషనల్ క్రష్ రెడీ అవుతోంది.