Rashmika Deep Fake : రష్మిక వీడియో నిందితుడు.. ఎలా దొరికాడంటే …!
నటి రష్మిక మందాన (Rashmika Mandana) డీప్ ఫేక్ ( Deep Fake) వీడియో నిందితుడు ఈమని నవీన్ (Naveen) ను పట్టుకోడానికి పోలీసులు దేశవ్యాప్తంగా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడు తప్పించుకోవాలని చూసినా .. దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులు ఢిల్లీ నుంచి గుంటూరు దాకా పెద్ద నెట్ వర్క్ ను ఛేదించాల్సి వచ్చింది.

Rashmika video accused.. how was he found...!
నటి రష్మిక మందాన (Rashmika Mandana) డీప్ ఫేక్ ( Deep Fake) వీడియో నిందితుడు ఈమని నవీన్ (Naveen) ను పట్టుకోడానికి పోలీసులు దేశవ్యాప్తంగా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. టెక్నాలజీ ఉపయోగించి నిందితుడు తప్పించుకోవాలని చూసినా .. దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులు ఢిల్లీ నుంచి గుంటూరు దాకా పెద్ద నెట్ వర్క్ ను ఛేదించాల్సి వచ్చింది. అరెస్ట్ కు రెండు రోజుల ముందు నవీన్ చేసిన ఓ పనితో ఈజీగా పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు.
బ్రిటీష్ ఇండియన్ మోడల్ జారా (British Indian Model) పటేల్ వీడియోను డీప్ ఫేక్ ద్వారా రష్మిక వీడియోగా తయారు చేశాడు గుంటూరుకు చెందిన నిందితుడు ఈమని నవీన్. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఈ సంఘటనపై అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రధాని మోడీ దగ్గర నుంచి ప్రముఖులు, సినీ నటులు అందరూ ఖండించారు. రెండు రోజుల క్రితం నవీన్ ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. కానీ ఇతనే రష్మిక వీడియోను సృష్టించాడు అని కనుక్కోడానికి పోలీసులు బడా ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. 50 మొబైల్ ఫోన్లు, 12 ల్యాప్ టాప్స్, కాల్ రికార్డులు, డిలీట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్, ఓ డిలీటెడ్ ఈ-మెయిల్ ను పరిశీలించిన తర్వాతే నవీన్ ను నిందితుడిగా తేల్చారు.
రష్మిక డీప్ ఫేక్ వీడియోపై నవంబర్ 10న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను ఇన్ స్టా గ్రామ్ నుంచి డిలీట్ చేయించారు. ఢిల్లీకి చెందిన IFSOబృందం, నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ (National Cyber Forensic Lab) తో కలసి రివర్స్ అనలైజింగ్ టెక్నాలజీతో రష్మిక ఫేక్ వీడియోలను పరిశీలించారు. పోలీసులకు ఫేస్ బుక్ బృందం కూడా సహకరించింది. ఈ వీడియో మొదట ఎక్కడ నుంచి షేర్ అయిందో తెలుసుకోడానికి దాదాపు 500 కు పైగా సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలించారు. అందులో భాగంగా 20 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.. కానీ వీళ్ళల్లో చాలామంది తమకు వీడియో ఏ అకౌంట్ నుంచి వచ్చిందో చెప్పలేకపోయారు. దాంతో 40 నుంచి 50 దాకా మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్ టాప్స్ ను పోలీపసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.
సోషల్ మీడియాలో రష్మిక ఫ్యాన్స్ (Rashmika fans) పేరుతో ఉన్న పేజీలు, వాటి ఐపీ అడ్రస్సులను సేకరించి పరిశీలించారు. ఈ వీడియో తయారు చేసింది గుంటూరుకు చెందిన నవీన్ అని గుర్తించినా… అతడిని అరెస్ట్ చేయడానికి రెండు రోజుల ముందు వరకూ కన్ఫమ్ చేసుకోలేకపోయారు ఢిల్లీ పోలీసులు. అయితే రష్మిక ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పేజీని నడిపిన నవీన్ కు… లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఆ పేజీని సడన్ గా డిలీట్ చేశాడు. అంతేకాదు.. ఆ పేజీ క్రియేట్ చేయడానికి ఉపయోగించిన ఈ-మెయిల్ ని కూడా రిమూవ్ చేశాడు నవీన్. రష్మిక ఫేక్ వీడియో, షేరింగ్ నంబర్ డేటాను కూడా తొలగించడంతో పోలీసులకు దొరికిపోయాడు. ఐపీ అడ్రెస్ ద్వారా నవీన్ ఉండే ప్రాంతాన్ని కనుక్కొని చివరికు అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఏ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక ఫేక్ వీడియో కేసు నుంచి తప్పించుకోవాలని నవీన్ చూశాడో… అదే టెక్నాలజీ అతడిని పోలీసులకు పట్టించింది.