Ravindra Jadeja: అసలు సిసలు ఆల్ రౌండర్ రవీంద్ర అనిరుద్ సింగ్ జడేజా
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కపిల్ దేవ్ తర్వాత అరుదైన ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కారు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ఆటగాడిగా, వన్డేల్లో టీమిండియా తరఫున కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఓవరాల్ గా భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్క్ ను అందుకున్న ఏడవ బౌలర్ గా కూడా జడ్డు తన జాదూగర్ ను కొనసాగిస్తున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరుగిన మ్యాచ్‌లో షమీమ్ హొస్సేన్ వికెట్ తీసుకోవడంతో జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.
కెరీర్‌లో 182వ వన్డేలు ఆడిన జడేజా.. 200 వికెట్లతో పాటు ఇప్పటి వరకు 2,578 పరుగులు చేశాడు. ఇక వరుసగా రెండు విక్టరీలతో ఫైనల్ చేరి ఆసియా కప్ సూపర్–4 ఆఖరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసిన ఇండియాకు బంగ్లాదేశ్ ఝలక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 6 రన్స్ తేడాతో ఇండియాపై నెగ్గింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 265 స్కోరు చేసింది. తర్వాత ఇండియా 49.5 ఓవర్లలో 259 రన్స్‌కు ఆలౌటైంది. షకీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.