Virat Kohli: కోహ్లీ క్యాచ్.. జడేజా జోక్
ఈ క్యాచ్ గురించి మాట్లాడిన రవీంద్ర జడేజా.. కోహ్లీ రిఫ్లెక్స్‌లను తెగ మెచ్చుకున్నాడు. ఆ క్యాచ్ చూస్తే తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్‌లో కూడా ఎవరో ఒకరు ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ ఎప్పటికైనా పట్టాల్సిందే అంటూ జోక్ చేశాడు.

Virat Kohli: విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత స్పిన్నర్లు చెలరేగారు. కుల్దీప్ యాదవ్‌తోపాటు రవీంద్ర జడేజా కూడా బంతితో అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. వాటిలో రొమేరియో షెఫర్డ్ వికెట్ ఒకటి. జడేజా బౌలింగ్‌లో షెఫర్డ్ భారీ షాట్ ఆడబోయాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ చాలా వేగంగా రియాక్ట్ అయ్యాడు. కుడివైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
దీన్ని చూసిన మిగతా ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ క్యాచ్ గురించి మాట్లాడిన రవీంద్ర జడేజా.. కోహ్లీ రిఫ్లెక్స్‌లను తెగ మెచ్చుకున్నాడు. ఆ క్యాచ్ చూస్తే తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్‌లో కూడా ఎవరో ఒకరు ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ ఎప్పటికైనా పట్టాల్సిందే అంటూ జోక్ చేశాడు. టీమిండియా బెస్ట్ ఫీల్డర్లలో జడేజా ఒకడన్న సంగతి తెలిసిందే. అతను ఇప్పటి వరకు ఎన్నో స్టన్నింగ్ క్యాచులు అందుకున్నాడు. ‘మిగతా వాళ్లు బౌలింగ్ చేసే సమయంలో నేను ఎన్నోసార్లు మంచి క్యాచులు అందుకున్నా. ఇప్పుడు నా బౌలింగ్‌లో ఇలాంటి క్యాచ్ చూడటం చాలా బాగుంది. విరాట్ సూపర్ క్యాచ్ పట్టాడు. చాలా తక్కువ ఎత్తులో వచ్చిన ఆ క్యాచ్ అందుకోవాలంటే తను చాలా షార్ప్‌గా ఉండాలి. కోహ్లీ దాన్ని అద్భుతంగా అందుకున్నాడు’ అని జడ్డూ మెచ్చుకున్నాడు.