IPL : Rohit Sharma రాయుడు సంచలన వ్యాఖ్యలు.. ధోనీ తర్వాత రోహితే చెన్నై కెప్టెన్..
చెన్నె సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొత్త కెప్టెన్ ఎవరు ఉండాలనే దానిపై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోహిత్ శర్మ (Rohit Sharma) ముంబైను వీడి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరతాడనే అర్దం వచ్చేలా రాయుడు వ్యాఖ్యలు చేశాడు. అలాగే ధోనీ స్ధానంలో చెన్నై కెప్టెన్సీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు.
చెన్నె సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొత్త కెప్టెన్ ఎవరు ఉండాలనే దానిపై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోహిత్ శర్మ (Rohit Sharma) ముంబైను వీడి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరతాడనే అర్దం వచ్చేలా రాయుడు వ్యాఖ్యలు చేశాడు. అలాగే ధోనీ స్ధానంలో చెన్నై కెప్టెన్సీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు. ముంబై ఇండియన్స్‌ను విడిచిపెట్టడం ద్వారా రోహిత్ వేరే జట్టుకు మారే టైం వచ్చిందని చెప్పాడు. రోహిత్‌లో ఇంకా 5-6 ఏళ్ల క్రికెట్ మిగిలి ఉందనీ, అతను ముంబైని విడిచిపెట్టి, కొత్త జట్టులో చేరాలని సూచించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనికి బాగా సూట్ అవుతుందన్నాడు. అతను జట్టుకు కెప్టెన్ కూడా కాగలడంటూ అంబటి రాయుడు అంచనా వేశాడు.
ఐపీఎల్ (IPL) లో ఏ జట్టుకైనా సారథ్యం వహించగల సామర్థ్యం రోహిత్ శర్మకు ఉందని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగతంగా తాను రోహిత్ శర్మను సీఎస్కే కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నానని రాయుడు చెప్పాడు. రోహిత్ సీఎస్కేకి వెళ్లడంపై రాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో సంచలనంగా మారాయి. రోహిత్ ను ముంబై జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ఇప్పటికే అతని అభిమానులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. టీమిండియా (Team India) కెప్టెన్ గా ఉన్న రోహిత్.. ముంబైకి పనికిరాడా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయుడు వ్యాఖ్యలతో రోహిత్ చెన్నై వైపు చూస్తున్నాడా అన్న చర్చ సాగుతోంది