UPI Now Pay Later: బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా..?

మన బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేసేలా వెసులు బాటు కల్పించింది ఆర్బీఐ. క్రెడిట్ లైన్ అప్రూవ్డ్ ద్వారా ఈ సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి బ్యాంకులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 09:50 AMLast Updated on: Sep 18, 2023 | 9:50 AM

Rbi Has Introduced A New Policy Called Upi Now Pay Later

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే మన అకౌంట్లో డబ్బులు ఉంటేనే ఈ లావాదేవీలు జరిపేందుకు వీలుపడుతుంది. మరి అకౌంట్లో డబ్బులు లేకుంటే పరిస్థితి ఏంటి. అలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండేందుకే యూపీఐ నౌ పే లేటర్ అనే సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఒకప్పుడు బై నౌ.. పే లేటర్, లేజీపే అనే రకరకాల యాప్ లు చూసే ఉంటాం. ఆ కోవలోకి ఈ యూపీఐ నౌ పే లేటర్ వచ్చి చేరింది. దీనిని ఎలా చేయాలన్న సందేహం మీలో కలుగవచ్చు. బ్యాంకులు ముందుగా మనకు అప్రూవ్ చేసిన క్రెడిట్ లైన్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రతి ఒక్కరూ డెబిట్ కార్డు/ బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే యూపీఐ లకు అనుసంధానం చేసి నగదు బదిలీ చేస్తూ ఉంటారు. ఈ సరికొత్త సేవలు అందుబాటులోకి రావడంతో ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ ని యూపీఐకి జత చేసుకొని లావాదేవీలు జరిపే సౌలభ్యాన్ని అందించింది ఆర్బీఐ.

ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్..

బ్యాంకులు ప్రతి వినియోగదారునికి తన ఆర్థిక లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని కొంత వరకూ రుణాన్ని ముంజూరు చేస్తూ ఉంటాయి. ఇలా మంజూరు చేసిన రుణ సౌకర్యాన్నే ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటారు. అంటే ముందుగానే మీకు కొంత నగదును అప్పులాగా ఇస్తాయన్న మాట. ఈ సదుపాయాన్ని ప్రస్తుతం వాడుకలో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే, మొబిక్విక్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ లైను ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా అకౌంట్ హోల్డర్ అనుమతిని తీసుకుంటాయి. బ్యాంకులు ఈ ప్రక్రియను ఆమోదించిన తరువాత యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుపవచ్చు. ఈ లావాదేవీలపై కొన్ని పరిమితులు విధిస్తాయి బ్యాంకులు. బ్యాంకులు ఇచ్చిన లిమిట్ లోపే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు చేసుకున్న డబ్బులను ఇచ్చిన గడువు తేదీ లోపూ చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకింగ్ రంగ సంస్థలు ఈ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తే మరి కొన్ని వడ్డీలు విధిస్తాయి.

నిర్థిష్ట సమయానికి చెల్లింపులు చేయకుంటే..

ఆర్బీఐ ఆదేశాల మేరకు చాలా వరకూ బ్యాంకులు తమ ఖాతాదారులకు క్రెడిట్ లైన్ సౌకర్యాలు అందిస్తున్నాయి. బ్యాంకులను బట్టి క్రెడిట్ లిమిట్, పేమెంట్ డ్యూరేషన్, వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఒక బ్యాంకు ఖర్చు చేసుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ విధిస్తుంది. మరి కొన్ని బ్యాంకులు ఇచ్చిన లిమిట్ కంటే ఎక్కువ డబ్బులు వాడితే అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఒక వేళ సరైన సమయానికి చెల్లింపులు జరుపకపోతే మన సేవింగ్స్, కరెంట్ ఖాతాల నుంచి తీసుకునేలా ముందుగా అగ్రిమెంట్ కుదుర్చుకుంటాయి బ్యాంకులు. ప్రస్తుతం ఈ సౌకర్యం మర్చెంట్ అకౌంట్ హోల్డర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో సామాన్యులకు కూడా వారి బ్యాంకు లావాదేవీలు, సిబిల్ స్కోర్ ను బట్టి క్రెడిట్ అప్రూవ్డ్ ను అందిచనున్నాయి.

T.V.SRIKAR