ఈ సాలా కప్ నమదే గణేశుడికి ఆర్సీబీ ఫ్యాన్ పూజలు

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరునే ముందు చెబుతారు. ఎందుకంటే ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నా ఛాంపియన్ కాలేకపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2024 | 07:00 PMLast Updated on: Sep 17, 2024 | 7:00 PM

Rcb Fans Pray For Cup

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరునే ముందు చెబుతారు. ఎందుకంటే ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నా ఛాంపియన్ కాలేకపోయింది. 17 సీజన్లుగా ప్రతీసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం… అభిమానులను నిరాశపరచడం ఆ జట్టుకు కామన్ గా మారిపోయింది. ప్రతీ ఏడాది ఈ సాలా కమ్ నమదే అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఒకదశలో ఈ నినాదంపై ఫన్నీ మీమ్స్ కూడా చాలా వచ్చాయి. గత సీజన్ లోనూ ఆర్సీబీ ఈ నినాదాన్ని నిజం చేయలేకపోయింది. అయినప్పటకీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఆర్సీబీ ఫ్యాన్స్ చేసిన పూజలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. బెంగళూరులో ఒక అభిమాని ఈ సాలా కప్ నమదే అంటూ పేపర్ పై రాసి వినాయకుడి పాదాల దగ్గర పెట్టి పూజలు చేశాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆర్సీబీ టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ ఎంత బలంగా కోరుకుంటున్నారో ఈ వీడియోను చూసి చెప్పొచ్చు. నిజానికి జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్సే ఉన్నా కీలక సమయాల్లో విఫలమవడం ఆర్సీబీ కొంపముంచుతోంది. అలాగే సరైన వ్యూహం లేకుండా వేలంలో ఒకరిద్దరు ప్లేయర్స్ కు భారీగా ఖర్చు చేయడం… ఏదో ఒక విభాగం బలహీనంగా మారడం ఇదీ ఆర్సీబీ ఎదుర్కొంటున్న సమస్య. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో జరగనున్న మెగావేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.