IPL 2025 Virat Kohli : ఆ స్టార్స్ కు ఆర్సీబీ గుడ్ బై.. రిటైన్ చేసుకునేది వీరినే

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. గత నిబంధనల ప్రకారం చూస్తే వేలానికి ముందు ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 31, 2024 | 06:02 PMLast Updated on: Jul 31, 2024 | 6:02 PM

Rcb Good Bye To Those Stars They Are The Ones To Retain

ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగబోతోంది. గత నిబంధనల ప్రకారం చూస్తే వేలానికి ముందు ఫ్రాంచైజీలు ముగ్గురు ఆటగాళ్ళను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతీ టీమ్ తమ ఆటగాళ్ళలో రిటైన్ చేసుకునే వారిపై ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఎవరిని రిటైన్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆర్సీబీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. స్టార్ బ్యాటర్ (Star Batter) విరాట్ కోహ్లీ (Virat Kohli) తో పాటు రజత్ పటిదార్ ను ఆ ఫ్రాంచైజీ తమతోనే ఉంచుకోనుంది. మూడో ప్లేయర్ గా ఇంగ్లాండ్ (England) స్పిన్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది.

Suryakumar Yadav : ఇది కదా కెప్టెన్సీ అంటే… సూర్యాభాయ్ నువ్వు తోపు..

దీంతో సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ కెప్టెన్ డుప్లెసిస్ కు ఈ సారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ అద్భుత విజయాలు సాధించినా టైటిల్ గెలవడంతో విఫలమైంది. అలాగే ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్ వెల్ కు ఇప్పటికే గుడ్ బై చెప్పినట్టు సమాచారం. ఒకవేళ రిటెన్షన్ రూల్స్ మారితే నాలుగో ప్లేయర్ గా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ను ఆర్సీబీ కొనసాగించొచ్చు. ఈ నేపథ్యంలో గత ఆక్షన్ లో 11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా 17 కోట్లకు కొన్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలోకి రానున్నారు. వీరిద్దరూ నాణ్యమైన ప్లేయర్లే అయినా.. అంత భారీ మొత్తంలో చెల్లించడానికి ఆర్సీబీ సిద్ధంగా లేదు. ఇప్పటివరకు 17 సీజన్ లు జరిగినా బెంగళూరు జట్టు ఒక్క టైటిల్ గెలవలేదు. దీంతో ఈ సారి వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహించాలని భావిస్తోంది. నిలకడగా రాణించే ప్లేయర్స్ నే తీసుకోవాలని రెడీ అవుతోంది.

Cricketers, Olympics : క్రికెటర్ల చర్చంతా 2028 ఒలింపిక్స్ పైనే.. మాజీ కోచ్ ద్రావిడ్ కామెంట్స్